Rahul Padayatra: తెలంగాణలో రాహుల్ పాదయాత్రలో టీ కాంగ్రెస్ బిగ్ ప్లాన్.. ఏకంగా లక్ష మందితో..

Rahul Padayatra: భారత్ జోడో యాత్ర పేరుతో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తమిళనాడు, కేరళ, కర్ణాటకలో రాహుల్ పాదయాత్ర ముగియగా.. ప్రస్తుతం ఏపీలో రాహుల్ పాదయాత్ర కొనసాగుతోంది. ఏపీలోని అనంతపురం, కర్నూలు జిల్లాల్లో రాహుల్ పాదయాత్ర కొనసాగనుంది. సుమారు 11 కిలోమీటర్లు ఏపీలో రాహుల్ పాదయాత్ర చేయనున్నారు. ఇక ఏపీలో ముగిసిన తర్వాతత తెలంగాణలో రాహుల్ పాదయాత్ర ప్రారంభం కానుంది. ఈ నెల 23 నుంచి తెలంగాణలో రాహుల్ పాదయాత్ర ప్రారంభం కానుంది. దాదాపు 11 రోజుల పాటు తెలంగాణలో రాహుల్ పాదయాత్ర సాగనుంది.

దీంతో రాహుల్ పాదయాత్ర కోసం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్గాలు ఏర్పాట్లు చేస్తోన్నాయి. రాహుల్ గాంధీ పాదయాత్రను తెలంగాణలో సక్సెస్ చేసేందుకు టీ కాంగ్రెస్ నేతలు కసరత్తు చేస్తోన్నారు. భారీగా జన సమీకరకణ చేసి తెలంగాణలో రాహుల్ పాదయాత్రను గ్రాండ్ సక్సెస్ చేయాలని టీ కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు చేస్తోన్నారు. రాహుల్ పాదయాత్రతో తెలంగాణ కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త జోష్ వస్తుందని, రాష్ట్రంలో పార్టీ పుంజుకుంటుందని చెబుతున్నారు. నేతల మధ్య సమన్వయం ఏర్పడుతుందని, అందరూ విబేధాలు వదిలేసి ఏకతాటిపైకి వస్తారనే ఆశాభావం హస్తం శ్రేణుల్లో వ్యక్తమవుతుంది. ప్రస్తుతం టీ కాంగ్రె్ నేతల్లో విబేధాలు నెలకొన్నాయి. ఎవరికి వారు యమునా తీరే అన్నట్లు ప్రవరిస్తుండటంతో కాంగ్రెస్ వర్గాలు చీలిపోయాయి.

ఈ క్రమంలో రాహుల్ పాదయాత్ర ద్వారా అందరూ ఒకతాటిపైకి వస్తారని కార్యకర్తలు బావిస్తున్నాయి. అందుకోసం పాదయాత్రను సక్సెస్ చేయాలని చూస్తున్నారు. ప్రతిరోజు లక్ష మందితో యాత్ర నిర్వహించాలని చూస్తున్నారు. తాజాగా ఏఐసీసీ కార్యక్రమాల వ్యవహారాల కమిటీ ఛైర్మన్, జోడో యాత్ర సమన్వయ కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి గాంధీభవన్ లో రాహుల్ పాదయాత్ర ఏర్పాట్లపై కీకల సమావేశం నిర్వహించారు. జనసమీకరణ, సమన్వయం, ఇతర అంశాలపై చర్చించారు. రోజు లక్ష మంది రాహుల్ పాదయాత్రలో పాల్గొనేలా కసరత్తలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ కూడా పాల్గొన్నారు.

దాదాపు 375 కిలోమీటర్లు రాహుల్ పాదయాత్ర సాగనుంది. ప్రతిరోజు సాయంత్రం కార్నర్ మీటింగ్స్ జరిపేలా టీపీసీసీ ఏర్పాట్లు చేస్తోంది. పాదయాత్రలో పాల్గొనేవారితో పాటు ప్రజలు కూడా రాహుల్ తో మాట్లాడేలా కాంగ్రెస్ కసరత్తులు చేస్తోంది. దాదాపు లక్ష మందిని రాహుల్ ను కలుసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఏలేమి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. మక్తల్ నుంచి జుక్కల్ వరకు తెలంగాణలో రాహుల్ పాదయాత్ర సాగనుంది. ప్రతిరోజులు ఉదయం 6 గంటల నుంచి రాహుల్ పాదయాత్ర సాగనుండగా.. 5 గంటలకే ప్రజలు సిద్దంగా ఉండేలా ఏర్పాట్లు చేస్తోన్నారు.

ప్రతి రెండు కిలోమీటర్ కు ఒక రిసీవింగ్ పాయింట్ ఏర్పాటు చేయనున్నట్లు ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేస్తున్నందును.. ఆయన మినహా అందరూ నేతలు పాదయాత్రలో పాల్గొనున్నారిన ఏలేటి మహేవ్వర్ రెడ్డి చెప్పాడు. రాహుల్ యాత్రను సక్సెస్ చేసి తెలంగాణలో అధికారం దిశగా శ్రేణులు సిద్దంగా చేస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఈ సమావేశంలో ఏఐసీసీ సెక్రటరీ నదీం జావిద్, ఇతర కాంగ్రెస్ ముఖ్యనేతలు పాల్గొన్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -