Sudigali Sudheer: సుడిగాలి సుధీర్‌ షోస్‌లలో కనిపించకపోవడానికి కారణం అదే!

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్‌ అంటే తెలియని వారెవరూ ఉండరు. జబర్దస్త్‌ స్టార్ట్‌ అయిందంటే చాలా సుడిగాలి సుధీర్‌ స్కిట్‌ కోసం ఎదురుచూస్తుంటారు. జబర్దస్త్‌ షో ద్వారా ఊహించని స్థాయిలో ఫేమస్‌ అయిన సుడిగాలి సుధీర్ ఒకడు. అయితే రోజురోజుకు సుధీర్‌ అభిమానుల సంఖ్య పడిపోతుందని వార్తలు వస్తున్నాయి. ఎన్నో ఏళ్లుగా టీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్‌లో కంటిన్యూ అవుతున్నా సుధీర్‌ గత కొన్ని నెలలుగా జబర్దస్త్‌లో కనిపించడం లేదు. ఛానెళ్లు ఎక్కువ మొత్తంలో రెమ్యునరేషన్ ఆఫర్ చేయడంతో అటుగా వెళ్లినట్లు సమాచారం.

అయితే గత కొన్ని రోజులుగా సుదీర్ ఏ ప్రోగ్రాం లో కూడా కనిపించడం లేదు ఈ టీవీ ఇచ్చిన స్థాయిలో సుధీర్ ఇతర చానళ్లు ప్రాధాన్యం ఇవ్వడం లేదని కామెంట్స్ వ్యక్తమవుతూనే ఉండటం గమనార్హం. జబర్దస్త్ షో కి గుడ్ బై చెప్పడమే సుధీర్‌కు శాపమైంది కామెంట్లు వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ మధ్య కాలంలో సుధీర్ నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాలు అందుకోలేదు. సుధీర్ మళ్లీ జబర్దస్త్ షోలోకి రీఎంట్రీ ఇవ్వాలని అనుకున్నా అక్కడ రీ ఎంట్రీ ఇచ్చే పరిస్థితులు అయితే లేవనే సంగతి తెలిసిందే.

ఇతర ఛానెళ్ల లోని షోల కోసం జబర్దస్త్ కి గుడ్ బై చెబితే మల్లెమాల నిర్వాహకులు వాళ్లకు ఛాన్స్ ఇవ్వడానికి అస్సలు ఆసక్తి చూపరు. సుధీర్‌కు కూడా ఇదే పరిస్థితి ఎదురు కానుంది. జబర్దస్త్ స్థాయిలో సక్సెస్ సాధించిన కామెడీ షోల సంఖ్య తక్కువనే సంగతి తెలిసిందే. సుధీర్ ఎక్స్‌ట్రా జబర్దస్త్‌కు దూరమైనా షో రేటింగ్ మాత్రం తగ్గలేదనే చెప్పాలి. జబర్దస్త్‌తో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెల్లో నిలిచిపోచిన సుధీర్‌ తన కెరీర్ విషయంలో తప్పటడుగులు వేశాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ప్రధానమైన కారణాలివే.. ఆ తప్పులే ముంచేశాయా?

తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి అధికారాన్ని సొంతం చేసుకుంటామని కాన్ఫిడెన్స్ తో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించిన ఈ పార్టీకి 2023 ఫలితాలు మాత్రం...
- Advertisement -
- Advertisement -