Bank: కస్టమర్లకు షాకిచ్చిన బ్యాంక్‌.. ఇకపై ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

Bank:ఒకప్పుడు డబ్బులు జమా చేయాలన్నా తీయలన్నా బ్యాంకుల వద్ద పడిగాపులు గాయాల్సి వచ్చేది. భారీగా క్యూలైన్లలో గంటల తరబడి నిలబడి లావాదేవీలు జరిపేవారు. చదువుకోని వారికి బ్యాంక్‌ ఫామ్‌ నింపేందకు రాకపోవడంతో ఇదే అదనుగా చూసుకుని కొందరు బ్యాంకుల వద్ద ఫారాలు నింపేందుకు తిష్ట అమాయకుల వద్ద డబ్బులు దండుకునేవారు. రాను రాను ఏటీఎం మిషన్‌ను అందుబాటులోకి వచ్చిన తర్వాత అస్సలు బ్యాంకులకు వెళ్లే పరిస్థితి మారిపోయింది.నిరక్ష్యరాస్యులు సైతం ఏటీఎం ద్వారా డబ్బులు డ్రా చేసుకోవడం నేర్చుకుని సొంతంగా డబ్బులు తీసుకుంటున్నారు.

ఇటీవల డబ్బులు డిపాజిట్‌ మిషన్లు సైతం రావడంతో అస్సలు బ్యాంకు లోపలికి ఎవరూ వెళ్లడం లేదు. కనీసం బ్యాంక్‌ పాసుబుక్‌ ప్రింట్‌ కూడా మిషన్‌ ద్వారా తీయడంతో బ్యాంకులన్నీ ఖాళీగా ఉంటున్నాయి. కేవలం పెద్ద మొత్తంలో డబ్బులు, చెక్‌లను డిపాజిట్‌ చేసేందుకు మాత్రమే బ్యాంకుల్లోకి వెళ్తున్నారు.
ఇకపై ఏటీఎంలను ఇష్టానుసారంగా వాడితే వారికి బ్యాంక్‌ షాక్‌ ఇవ్వనుంది. పరిమితికి మించి ఏటీఎంను ఉపయోగిస్తే మీ జేబులు చిల్లు పడటం ఖాయం. ఆగస్టు 1 నుంచి బ్యాంకులన్నీ ఇంటర్‌ చెంచ్‌ ఫీజులను పెంచాయి.

రూ.15 నుంచి రూ. 21 కి..
ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణపై చార్జీలు పెంచేందుకు ఆర్‌బీఐ బ్యాంకులను అనుమతిచ్చింది. తద్వారా ఒకే బ్యాంక్‌ ఏటీఎంలో నెలలో 5 సార్లు లావాదేవీలు ఉచితంగా జరపవచ్చు. అంతకు మించి జరిపితే ఒక‍్క ట్రాన్‌జేషన్‌కు రూ.21 కట్‌ అవుతాయి. ఇతర బ్యాంకుల్లో ఏటీఎం వాడితే నెలలో 3 రోజులు మాత్రమే ఉచితంగా ఉండి ఆతర్వాత రూ. 21 వసూలు చేస్తాయి. గతంతో చార్జేస్‌ రూ. 15 మాత్రమే ఉండేది. దాన్ని ఇప్పుడు రూ. 21 పెంచారు.

* రూ. 25 వేల వరకు లావాదేవీలకు, సొంత బ్యాంకు నుంచి 5 లావాదేవీలు, ఇతర బ్యాంకుల నుంచి 3 లావాదేవీలకు అనుమతిస్తారు.
* రూ.25 నుంచి రూ.50 వేల మధ్య లావాదేవీలకు, సొంత బ్యాంకు నుంచి 5 లావాదేవీలు, ఇతర బ్యాంకుల నుంచి 3 లావాదేవీలకు అనుమతిస్తారు.
*రూ. 50 వేల కన్నా ఎక్కువ లావాదేవీల కోసం ఇతర బ్యాంకుల నుంచి 3 సార్లు, మీ సొంత బ్యాంకు నుంచి అపరిమితంగా విత్‌డ్రా చేసుకోవచ్చు.

డెబిట్‌ కార్టు ఏడాది మెయింటెనెన్స్‌ ఛార్జీలు ఇలా..
క్లాసిక్‌ డెబిట్‌కార్డ్‌ – రూ.125 + GST
ప్లాటినం డెబిట్‌కార్ట్‌- రూ.250 + GST
ప్రైడ్‌/ప్రిమియం బిజినెస్‌ డెబిట్‌ కార్డ్‌-రూ.350+ GST
సిల్వర్/గ్లోబల్ కాంటాక్ట్‌లెస్ డెబిట్ కార్డ్ – రూ.125 + GST
యువ / గోల్డ్ / కాంబో / మై కార్డ్ ప్లస్ డెబిట్ కార్డ్ – రూ. 175 + GST
డెబిట్ కార్డ్ రీప్లేస్‌మెంట్ చార్జీలు – రూ.300 + GST
మళ్లీ పిన్ పొందడానికి – రూ.50 + GST

Related Articles

ట్రేండింగ్

AP Roads: ఏపీలో రోడ్ల పరిస్థితిని చూపించి ఓట్లు అడిగే దమ్ముందా.. వైసీపీ నేతల దగ్గర జవాబులున్నాయా?

AP Roads:  ఒక రాష్ట్రం అభివృద్ధి బాటలో నడవాలి అంటే ముందుగా ఆ రాష్ట్రంలో మౌలిక సదుపాయాలన్నీ కూడా సక్రమంగా ఉండాలి మౌలిక సదుపాయాలు అంటే రోడ్లు కరెంట్ నీరు వంటి వాటివి...
- Advertisement -
- Advertisement -