Chandrababu-NTR: బిగ్ ట్విస్ట్. .చంద్రబాబుతో జూనియర్ ఎన్టీఆర్‌తో భేటీ.. ముహూర్తం ఫిక్స్..?

Chandrababu-NTR: నందమూరి, నారా ఫ్యామిలీ అభిమానులు, టీడీపీ కార్యకర్తలు ఎగిరి గంతేసే వార్త బయటకు వచ్చింది. ఈ నెల 10న మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుతో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ భేటీ కానున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ అమెరికా పర్యటనలో ఉన్నారు. అమెరికా పర్యటన నుంచి వచ్చిన తర్వాత ఈ నెల 10న చంద్రబాబుతో భేటీ కానున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నివాసంలో ఈ భేటీ ఉంటుందని తెలుస్తోంది.

 

ఏపీలో ముందస్తు ఎన్నికలు రావడం ఖాయమని ప్రచారం జరుగుతుండటం, వైసీపీ, టీడీపీ మధ్య పొలిటికల్ హీట్ పెరగడం, త్వరలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ పాదయాత్ర ఉన్న నేపథ్యంలో చంద్రబాబుతో జూనియర్ ఎన్టీఆర్ భేటీ అత్యంత ఆసక్తికరంగా మారింది. ఈ భేటీలో రాజకీయాల గురించి చర్చ జరుగుతుందా? లేదా కుటుంబపరమైన చర్చనా? అనేది ప్రాధాన్యతను సంతరించుకుంది. రాజకీయాల గురించి చర్చ జరిగే అవకాశముందని చెబుతున్నారు.

 

టీడీపీతో జూనియర్ ఎన్టీఆర్‌కు గ్యాప్ ఉందనే ప్రచారం ఎప్పటినుంచో జరుగుతోంది. అలాగే జూనియర్ ఎన్టీఆర్‌ను టీడీపీలోకి తీసుకురావాలని చంద్రబాబును అనేకచోట్ల జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోరుతున్నారు. చంద్రబాబు బహిరంగ సభల్లో జూనియర్ ఎన్టీఆర్ జెండాలను ఎగురవేస్తున్నారు. ఎన్టీఆర్‌ను టీడీపీకి ప్రచారం చేసేలా చేయాలని ఫ్యాన్స్ ఎప్పటినుంచో కోరుతున్నారు. ఇప్పుడు టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న క్రమంలో చంద్రబాబుతో ఎన్టీఆర్ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.

 

ఈ నెల 27 నుంచి లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్నారు. ఈ పాదయాత్రకు హైప్ తెచ్చేందుకు జూనియర్ ఎన్టీఆర్ ను ఏమైనా చంద్రబాబు ఉపయోగించుకుంటారా అనే చర్చ జరుగుతోంది.లోకేష్ పాదయాత్రలో జూనియర్ ఎన్టీఆర్ పాల్గొంటే. పాదయాత్రకు క్రేజ్ రావడంతో పాటు టీడీపీకి ఎంతో ఉపయోగపడుతుందని చంద్రబాబు భావిస్తున్నారట. దీని గురించే ఈ భేటీ అని చెబుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -