TDP: బెజవాడలో టీడీపీ ఔట్ అంటున్న సామాన్యులు.. ఆ పార్టీకి చుక్కలేనా?

TDP: బెజవాడ టిడిపి ఎంపీ కేశినేని నానికి టిడిపి ప్రభుత్వం చెక్ పెట్టిందని తెలుస్తోంది. పొమ్మనలేక పొగ పెట్టారు అన్న సామెత నాని విషయంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈయన పార్టీలో కొనసాగవచ్చు కానీ పార్టీ పెద్దగా వ్యవహరించకూడదు పార్టీ విషయాలలో జోక్యం చేసుకోకూడదు పార్టీ పరంగా పెద్దరికంగా వ్యవహరించకూడదు ఇవి కేశనేని నానికి టిడిపి పెద్దలు పెడుతున్నటువంటి ఆంక్షలు.

 

బెజవాడలో గత కొంతకాలంగా చక్రం తిప్పుతున్నటువంటి నాని ఎంపీగా బాధ్యతలను నిర్వహిస్తూ వచ్చారు. అంతేకాకుండా చంద్రబాబు అరెస్టు విషయంలో కూడా ఢిల్లీ పెద్దలతో ఈయన మాట్లాడుతూ చంద్రబాబుకు చాలా సహాయపడ్డారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి నానిని తీరా ఎన్నికల ముందు పార్టీ నుంచి వెళ్లగొట్టలేక తనంతట తాను వెళ్లేలా చేయడంతో మరోసారి చంద్రబాబు నాయుడు నుంచి స్వరూపం బయటపడింది.

నేడు తిరువూరులో జరగబోయే చంద్రబాబు నాయుడు సభకు కేశినేని నానిని కాకుండా ఆయన తమ్ముడు చిన్నిని ఇన్చార్జిగా నియమించారు. దీంతో అసలు గొడవ మొదలైంది అంతేకాకుండా నిన్న పార్టీ కార్యాలయంలో కేశినేని నాని వర్గీయులు అలాగే నియోజకవర్గ పార్టీ ఇంచార్జ్ దేవదత్ వర్గీల మధ్య పెద్ద ఎత్తున గొడవ జరిగింది. పార్టీ ఆఫీస్ వద్ద ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలో ఎంపీ కేసినేని నాని ఫోటో లేకపోవడంతో ఈ వివాదం చెలరేగింది. చివరికి కుర్చీలు సైతం విసురుకుని కొట్టుకునే స్థాయికి వెళ్లిపోయారు.

 

ఇలా పార్టీ అధిష్టానం తన పట్ల వ్యవహరిస్తున్నటువంటి తీరు పై కేసినేని నాని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాను పార్టీకి రాజీనామా చేస్తున్నానని తెలిపారు. అయితే బెజవాడ ఎంపీ పదవి కేసినేని నానికి కాకుండా ఈసారి వేరే వాళ్లకు టికెట్ ఇవ్వాలని ఆలోచనలో కూడా చంద్రబాబు నాయుడు ఉన్నారని అందుకే ఈయనని పార్టీకి దూరం పెడుతున్నారని వార్తలు వచ్చాయి. ఇక నాని తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పడంతో బెజవాడలో తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది అంటూ పలువురు ఈ విషయంపై కామెంట్లు చేస్తున్నారు. మరి బెజవాడ ఎంపీ విషయంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -