Srikakulam: బస్సులో నుంచి ప్రయాణికుడిని తోసేసిన డ్రైవర్.. చివరికి?

Srikakulam: తాజాగా శ్రీకాకుళం జిల్లాలో ఒక కదులుతున్న బస్సులో నుంచి ప్రయాణికుడిని తోసేశారు బస్సు డ్రైవర్ క్లీనర్. అసలేం జరిగిందంటే.. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం బుడుమూరు జాతీయ రహదారి కూడలి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. విశాఖపట్నం మధురవాడ ప్రాంతానికి చెందిన గేదెల భరత్ కుమార్ అనే 27 ఏళ్ళ యువకుడు అర్ధరాత్రి విశాఖపట్నం నుంచి తన స్నేహితులతో కారులో శ్రీకాకుళం వెళ్ళాడు. ఆ తర్వాత పనుందని ఇంటికి వెళ్లాలని చెప్పడంతో భరత్ కుమార్ ను స్నేహితులు తెల్లవారుజామున భువనేశ్వర్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న ప్రైవేటు బస్సు ఎక్కించారు.

నవభారత్ కూడలి వద్ద బస్సు ఎక్కిన భరత్ కుమార్ ను బస్సు క్లీనర్ బొమ్మాళి అప్పన్న, డ్రైవర్ రామకృష్ణ రూ. 200 ఛార్జీ డబ్బులు అడిగారు. అయితే తన దగ్గర డబ్బు లేకపోవడంతో స్నేహితులు ఫోన్ పే చేస్తారని చెప్పాడు భరత్. కానీ ఎంతసేపటికీ స్నేహితులు ఫోన్ పే చేయలేదని డ్రైవర్, క్లీనర్ మరోసారి డబ్బులు అడిగారు. అప్పుడు భరత్ స్నేహితులకు ఫోన్ చేయగా ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది. దాంతో విశాఖపట్నం వెళ్లిన తర్వాత ఇస్తానని భరత్ చెప్పాడు. కానీ డ్రైవర్, క్లీనర్ భరత్ మాట పట్టించుకోకుండా అతనితో గొడవ పడ్డారు. బుడుమూరు సమీపంలో భరత్ ను కదులుతున్న బస్సులోంచి బయటకు తోసేశారు. దీంతో డివైడర్ మధ్యలో ఉన్న క్రాస్ బేరియర్ ను ఢీకొన్నాడు.

 

దీంతో తలకు బలమైన గాయం కాగా, కాలు విరిగిపోయింది. తీవ్ర గాయాలతో బాధపడుతున్న భరత్ ను హైవే పోలీసులు ఆసుపత్రికి తరలిస్తుండగానే మార్గం మధ్యలో మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి సీసీ టీవీ ఫుటేజ్ దొరకడంతో మూడు రోజుల పాటు హైవేపై దర్యాప్తు చేపట్టారు పోలీసులు. అయితే మడపాం టోల్ ప్లాజా తదితర చోట్ల తనిఖీ చేసిన సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ప్రైవేటు బస్సు డ్రైవర్, క్లీనర్ ను పట్టుకున్నారు. వారిని విచారించగా నేరం అంగీకరించారు. నిందితులను అరెస్టు చేసి కోర్టుకు తరలించామని పోలీసులు తెలిపారు.

Related Articles

ట్రేండింగ్

YCP-TDP: చంద్రబాబు అరెస్ట్ తో రగిలిపోతున్న టీడీపీ.. అరెస్ట్ పై వైసీపీ రియాక్షన్ ఏంటంటే?

YCP-TDP:  చంద్రబాబు నాయుడుని ఆధారాలు లేని కేసులో అరెస్టు చేసి జైల్లో పెట్టిన జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఏం చేస్తున్నాడు అంటే చంద్రబాబు నాయుడుని జైల్లో పెట్టిన సందర్భంగా పండగ చేసుకుంటూ బాగా...
- Advertisement -
- Advertisement -