Srikakulam: భార్య మరణాన్ని తట్టుకోలేని భర్త.. చివరకు ఏం చేశాడంటే?

Srikakulam: సాధారణంగా మనకి ఇష్టమైన వారు దూరంగా ఉంటేనే భరించలేనంత బాధ ఉంటుంది. అలాంటిది జీవితాంతం కష్టసుఖాలలో తోడుగా ఉండాల్సిన వారు మరణిస్తే ఆ బాధ మనం వర్ణించలేము. అలాంటి వారు మరణిస్తే ఆ బాధ భరించలేక ఇతరులు కూడా ఆత్మహత్య చేసుకొని మరణించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో కూడా ఇటువంటి సంఘటన చోటు చేసుకుంది.

ఎంతో ప్రేమగా చూసుకున్న భార్య అనారోగ్యంతో మరణించింది. భార్య లేని లోటు భరించలేని ఆ భర్త కూడా ఆత్మహత్య చేసుకుని మరణించిన ఘటన స్థానికంగా విషాదం నెలకొల్పింది. వివరాలలోకి వెళితే… శ్రీకాకుళం జిల్లా,ఆమదాలవలస మండలం ఈసర్లపేట గ్రామానికి చెందిన మంగరాజు భారత సైన్యంలో చేరి దేశానికి సేవ చేస్తున్నాడు. గత ఏడాది ఫిబ్రవరిలో అతడికి అదే గ్రామానికి చెందిన మౌనికతో పెద్దలు వివాహం జరిపించారు.

 

రాజబాబు వృత్తిపరంగా ప్రస్తుతం హర్యానాలో విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే రాజా బాబు భార్య మౌనిక ఏడు నెలల గర్భంతో ఉంది. అయితే ఆమెకు ఇటీవల అనారోగ్య సమస్యలు రావడంతో రాజా బాబు తండ్రి సత్యనారాయణ.. విశాఖపట్నంలోని ఆర్మీ ఆసుపత్రిలో చేర్చించాడు. భార్య అనారోగ్య విషయం తెలిసిన వెంటనే రాజబాబు కూడా సెలవుపై ఇంటికి వచ్చాడు. అనారోగ్యంతో ఉన్న భార్యను బతికించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేశాడు. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించటంతో ఏప్రిల్ 16వ తేదీన మరణించింది.

 

పండంటి బిడ్డకు జన్మనిస్తాదని ఆశపడిన రాజబాబుకి భార్య మరణం తీరనిలోటు మిగిల్చింది. భార్య మరణంతో మనోవేదనకు గురైన రాజబాబు నిద్రాహారాలు మాని బాధతో కుమిలిపోయాడు. ఈ క్రమంలో అతను కూడా అనారోగ్యం పాలయ్యాడు. దీంతో ఈనెల 19న ఆసుపత్రిలో చూయించుకుని వస్తానని ఇంట్లో చెప్పి బయటికి వెళ్లిన రాజబాబు తాను చనిపోతున్నట్లు స్నేహితులకు సందేశం పంపాడు. వెంటనే వారు ఆందోళన చెంది విషయాన్ని పొందూరు పోలీసులకు సమాచారమిచ్చారు.ఆ తర్వాత మిత్రులు, బంధువులు గాలించగా..చివరకు 11 గంటల సమయంలో కొంచాడ సమీపంలోని తోటలో చెట్టుకు వేలాడుతూ కనిపించాడు. ప్రస్తుతం ఈ ఘటన అందరినీ ఎంతగానో కలిచి వేస్తుంది.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -