Krishnagiri: కన్న కొడుకుని చంపిన తండ్రి.. చివరికి?

Krishnagiri: ఒకవైపు టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న కూడా మరోవైపు కులమత బేధాలు మాత్రం మనుషులను వీడడం లేదు. కుల వివక్షతో కొట్టుకు చస్తున్నారు. కుల పిచ్చితో ఒకరినొకరు చంపడం వరకు వెళ్తున్నారు. మరి ముఖ్యంగా ప్రేమ విషయంలో ఈ కులం పేరు బాగా అడ్డొస్తుందని చెప్పవచ్చు. మాయదారి కులం కోసం కన్నా బిడ్డలను కొడుకులని చంపడానికి కూడా వెనకాడడం లేదు కొందరు కసాయి తల్లిదండ్రులు. కులాల పేర్లు సాకుగా చెప్పి హత్యలకు దారుణాలకు ఒడిగడుతున్నారు. ఇటీవల కాలంలో పరువు హత్య కేసులు కలకలం రేపుతున్నాయి.

ఎక్కడ చూసినా కూడా ఈ కుల పిచ్చితో చాలా మంది ఎదుటి వ్యక్తులను దారుణంగా చంపేస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి తమిళనాడులో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే.. తమిళనాడు లోని కృష్ణగిరి జిల్లాలో పరువు హత్యకు ఇద్దరు బలయ్యారు. కృష్ణగిరి జిల్లా ఉత్తంగరి పక్కనే ఉన్న అరుణగిరి గ్రామంలో దండపాణి కుటుంబం నివసిస్తున్నారు. కాగా అతనికి సుభాష్ అనే కుమారుడు ఉన్నాడు. అయితే సుభాష్ తక్కువ కుల అమ్మాయి అనుష్కని ప్రేమించాడు. ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పగా అందుకు వారు అంగీకరించలేదు.

 

దాంతో ఆ యువతిని వివాహం చేసుకొని తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్నాడు. ఆ విషయాన్ని జీవించుకోలేకపోయినా ఆ యువకుడి తండ్రి దండపాణి కొడుకు కోడలిపై పగ పెంచుకున్నాడు. ఇద్దరు నిద్రిస్తున్న సమయంలో మీతో మాట్లాడాలని కొడుకు ఇంటికి వచ్చిన దండపాణి తనతో తెచ్చుకున్న కత్తితో కొడుకు సుభాష్, కోడలిపై దాడి చేశాడు. సుభాష్ తీవ్ర గాయాలతో మరణించాడు. అయితే కోడలిపై కత్తితో దాడి చేస్తున్న సమయంలో ఇంట్లోనే ఉన్న అత్త కన్నమ్మల్ అతడిని ఆపాలని ప్రయత్నించింది. ఆమెను కూడా కత్తితో నరికి హత్య చేశాడు. ఇంతలోనే తీవ్ర గాయాల పాలైన కోడలు అనుష్క అక్కడి నుంచి పారిపోయి చెట్ల మధ్యలో దాక్కుంది. కోడల్ని చంపేందుకు వెంబడిస్తుండగా.. దండపాణిని స్థానికులు పట్టుకున్నారు. అతడిని చితకబాది పోలీసులకు అప్పగించారు. పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Related Articles

ట్రేండింగ్

Union Minister Piyush Goyal: వైఎస్సార్ ను సైతం ముంచేసిన సీఎం జగన్.. ఆ కేసులో కావాలనే ఇరికించారా?

Union Minister Piyush Goyal: వైయస్సార్ కాలనీ పట్ల కేంద్రమంత్రి పియూష్ గోయెల్ తన ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో పీయూష్ గోయల్ విలేకరులతో మాట్లాడుతూ జగన్ పాలనపట్ల విరుచుకుపడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్...
- Advertisement -
- Advertisement -