Gopalganj: యువకుడి ప్రాణం తీసిన మోమోలు.. వాళ్లు విషం పెట్టి చంపారా?

Gopalganj: ప్రస్తుత కాలంలో యువతీ యువకులు ఫుడ్ చాలెంజ్ లో పాల్గొంటూ ఉంటారు.ఇంత సమయంలో ఎవరు ఎక్కువ ఫుడ్ తీసుకుంటారో అంటూ పెద్ద ఎత్తున పోటీలు పడుతూ ఉంటారు అయితే ఈ పోటీలలో భాగంగా ఓ కుర్రాడు చాలెంజ్ చేసి మరి 150 మోమోలు తిన్నారు. కట్ చేస్తే ఆ కుర్రాడు విగత జీవితం అందరిని షాక్ కి గురిచేస్తుంది. మరి ఈ ఘటన ఎక్కడ జరిగింది ఏంటి అనే విషయానికి వస్తే..

బీహార్ తూర్పు చంపారన్ జిల్లాలోని సిహోర్వ గ్రామానికి చెందిన విపిన్ కుమార్ అనే 25 సంవత్సరాల యువకుడు జిల్లాలోని ఒక మొబైల్ రిపేర్ దుకాణంలో పనిచేస్తున్నారు. అయితే స్నేహితులతో కలిసి ఫుడ్ చాలెంజ్ లో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఈయన స్నేహితులతో చాలెంజ్ చేసి 150 మొమోలు తిన్నారు. అయితే ఒకేసారి ఇన్ని తినడంతో తీవ్ర అస్వస్థతకు గురైన అక్కడికక్కడే మృతి చెందారు.

 

ఇక ఈ విషయం తెలుసుకున్న టువంటి పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే పోలీసులు ప్రాథమిక నిర్ధారణలో భాగంగా 150 మోమోలు ఒకేసారి తినడం వల్ల ఇలా అస్వస్థతకు గురై మరణించారని పోలీసులు తెలియజేశారు. కాకపోతే యువకుడు విపిన్ తండ్రి మాత్రం స్నేహితులపై ఆరోపణలు చేస్తున్నారు. తన కుమారుడిని ఉద్దేశపూర్వకంగానే తన స్నేహితులు చంపారంటూ ఆరోపణలు చేస్తున్నారు. తన కుమారుడినీ చంపడం కోసమే తాను తిన్నటువంటి ఆహార పదార్థాలలో విషం పెట్టారని అందుకే తన కుమారుడు మరణించారు అంటూ ఆరోపణలు చేస్తున్నారు. అయితే నిజానిజాలు ఏంటి అనే విషయం తెలియాలి అంటే పోస్ట్ మార్టం నివేదిక రావాల్సి ఉంది.

 

Related Articles

ట్రేండింగ్

YSR Cheyutha Scheme: డబ్బులన్నావ్.. డబ్బాలు కొట్టుకున్నావ్.. చేయూత నాలుగో విడత జమయ్యాయా జగన్?

YSR Cheyutha Scheme: జగన్మోహన్ రెడ్డి ఇటీవల తన ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన సంగతి తెలిసిందే .ఈ మేనిఫెస్టోలో భాగంగా ఈయన గత ఐదు సంవత్సరాల కాలంలో ఏ సామాజిక వర్గానికి...
- Advertisement -
- Advertisement -