Bihar: సెక్యూరిటీ ప్రాణాలు తీసిన రూ.50.. అసలేం జరిగిందంటే?

Bihar: ఇటీవల కాలంలో చాలా మంది మానవత్వం అన్న మాటను మరిచి చిన్నచిన్న విషయాలకి కూడా ఎదుటి వ్యక్తులను దారుణంగా చంపడానికి కూడా వెనకట్టడం లేదు. క్షణికావేశంలో చేసిన పొరపాట్లకుఆ తర్వాత జీవితాంతం జైల్లో ఊచలు లెక్కబెడుతున్నారు. ఇప్పటికే ఇలాంటి ఘటనలు చాలా జరిగినా కూడా అటువంటి దుర్మార్గులలో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా కూడా దొంగతనం చేశాడు అన్న అనుమానంతో ఒక వ్యక్తిని అతి దారుణంగా కొట్టి చంపారు. ఈ దారుణమైన ఘటన బోజర్ పూర్ జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

భోజ్‌పూర్ జిల్లాలోని అర్రా పాట్నా రహదారిపై కుల్హదియా టోల్ ప్లాజాలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న ఒక వ్యక్తిని తాజాగా కొంతమంది దుండగులు రూ.50 దొంగిలించాడన్న అనుమానంతో కొట్టి చంపారు. ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి ఉత్తర్ ప్రదేశ్ లోని గోండా జిల్లాకు చెందిన బల్వంత్ సింగ్ గా గుర్తించారు. దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడ్డ బల్వంత్ సింగ్ తన స్వగ్రానికి వెళ్లాడు. ఇటీవల రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషన్ కి అనుకూలంగా ఆ వ్యక్తి మాట్లాడినందుకు హర్యానాకు చెందిన కొంతమంది బౌన్సర్లు ఈ దాడికి పాల్పపడి ఉండవచ్చని బాధితుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

 

ఈ ఘటపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కుల్హదియా టోల్ ప్లాజా గార్డుగా పనిచేస్తున్న బల్వంత్ సింగ్ పై కొంతమంది దాడి చేసి తీవ్రంగా గాయపర్చడంతో అక్కడి సిబ్బంది అతడిని ట్రైన్ లో సొంతూరికి పంపించారని రైలులో ఆరోగ్యం క్షిణించడంతో గోండా జిల్లాలోని మన్కాపూర్ స్టేషన్ వద్ద దింపి రైల్వే పోలీసులు ఆస్పత్రిలో చేర్పించారని చికిత్స పొందుతూ బల్వంత్ సింగ్ మరణించాడని గోండా ఎస్పీ ఆకాశ్ తోమర్ వెల్లడించారు. కేసు నమోదు చేసుకొని నింధితుల కోసం గాలిస్తున్నామని తెలిపారు. కాగా సదరు బాధితుడి కుటుంబ సభ్యులు నిందితులను కఠినంగా శిక్షించాలి అని డిమాండ్ చేస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -