Karnataka Election: కర్ణాటక ఎన్నికల్లో ఓటర్లకు ఆఫర్లు మామూలుగా లేవుగా!

Karnataka Election: ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు ప్రజల పట్ల ఉన్నటువంటి ప్రేమను వ్యక్తపరుస్తుంటారు.ఒక్కసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల కష్టాల గురించి ప్రజల బాగోగుల గురించి గ్రామాల అభివృద్ధి గురించి పట్టించుకోనే నాయకుడు ఉండరు కానీ ఎన్నికల సమయంలో మాత్రం అధికార ప్రతిపక్ష నేతలు పెద్ద ఎత్తున ప్రజలలోకి వచ్చి ప్రజలపై ప్రేమను చూపిస్తూ ఉంటారు.అయితే ఎన్నికల సమయంలో ఓటర్లను సంతలో పశువులను కదా కొనుగోలు చేసినట్టు కొనుగోలు చేస్తుంటారు.

తమ పార్టీకి ఓటు వేయాలంటూ పెద్ద ఎత్తున అధికార ప్రతిపక్ష నాయకులు ఓటర్లను ప్రభావితం చేయడం కోసం డబ్బులు పంచడం మందు సీసాలు పెంచడం చీరలు పెంచడం వంటివి చేస్తుంటారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో అక్కడ ఓటర్లను ప్రభావితం చేయడం కోసం రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున ఆఫర్ ప్రకటించారు.ఇలా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా ఒక్కో ఓటుకు దాదాపు 5000 రూపాయలు డబ్బు పంపిణీ చేసినట్టు తెలుస్తుంది.

 

కర్ణాటకలో ముఖ్యంగా బళ్లారిలో పెద్ద ఎత్తున ఓటర్లకు డబ్బు పంపిణీ చేస్తున్నారని సమాచారం.ఇలా ఒక్క ఇంటికి దాదాపు 30 వేల వరకు డబ్బులు పంపిణీ చేస్తున్నారని తెలుస్తుంది. బళ్లారి సిటీ, బళ్లారి గ్రామీణ నియోజకవర్గాల్లో దాదాపు రూ. 250 కోట్లు ఓటర్లకు పంచినట్లు సమాచారం. అలానే ఇంటికో కోడిని కూడా పంపిణీ చేశారు. జాతీయ పార్టీల తరపున ఇద్దరు ప్రధాన అభ్యర్థులు ఈ డబ్బును పంచినట్లు ప్రచారం జరుగుతోంది.

 

ఇలా రాజకీయ నాయకుల నుంచి ఓటర్లు కూడా డబ్బును తీసుకోవడమే కాకుండా కోళ్లను కూడా తీసుకున్నారట కానీ ఓటు మాత్రం ఎవరికి వేస్తారు.. ఇచ్చిన డబ్బులు తీసుకొని న్యాయంగా వారికి ఓటు వేస్తారా లేకపోతే సరైన నాయకుడిని ఎంపిక చేసుకుంటారా అనే విషయం తెలియాల్సి ఉంది ఏది ఏమైనా కర్ణాటక ఎన్నికలు మాత్రం ప్రస్తుతం సంచలనంగా మారాయన చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -