Karnataka Election: కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపునకు కారణమైన ఈ వ్యక్తి ఎవరంటే?

Karnataka Election: తాజాగా కర్ణాటకలో ఎన్నికలు ముగిసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ ఎన్నికలు బీజేపీకి ఊహించని షాక్ ఇచ్చాయి. అంతేకాకుండా బీజేపీ చేదు అనుభవం ఎదురయింది. నరేంద్ర మోడీ, మోహిత్ షా లాంటి వారికి సైతం నిరాశే మిగిలింది. వారి కష్టమంతా కూడా బూడిదలో పూసిన పన్నీరు అయ్యింది. దక్షిణాది రాష్ట్రాల్లో అనుకూల ఫలితాలను సాధించడం బీజేపీకి సులువు కాదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ ఓటమికి సంబంధించి ప్రస్తుతం వేర్వేరు కారణాలు ప్రచారంలోకి వస్తున్నాయి. అయితే కాంగ్రెస్ గెలుపుకు కారణమైన వ్యక్తి ఎవరనే ప్రశ్నకు సునీల్ కనుగోలు పేరు సమాధానంగా వినిపిస్తోంది.

కాంగ్రెస్ పార్టీకి సునీల్ కనుగోలు మరో ప్రశాంత్ కిషోర్ అయ్యారని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. తెర వెనుక సునీల్ కనుగోలు ఎంతో కష్టపడటం వల్లే కాంగ్రెస్ మరో పార్టీ సహాయం లేకుండా అనుకూల ఫలితాలను సొంతం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన పథకాలు ప్రజల్లోకి వెళ్లేలా సునీల్ కనుగోలు కృషి చేశారు. కాగా గతంలో అనగా 2014 ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ తో కలిసి పని చేసిన సునీల్ కనుగోలుకు రాబోయే రోజుల్లో ఊహించని స్థాయిలో డిమాండ్ పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.

 

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలోని రాష్ట్రాలకు సంబంధించిన ప్రముఖ రాజకీయ పార్టీలు ప్రస్తుతని సునీల్ కనుగోలు పై దృష్టి పెట్టారని సమాచారం అందుతోంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్తగా పని చేస్తున్న ఈ వ్యక్తి రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా కాంగ్రెస్ కు అనుకూల ఫలితాలు వచ్చేలా చేస్తారేమో చూడాలి. సోషల్ మీడియాలో పెద్దగా కనిపించని సునీల్ కనుగోలు తెర వెనుక వేసే స్ట్రాటజీలు పార్టీల విజయాలలో కీలక పాత్ర పోషిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మరింత కష్టపడితే కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -