Karnataka Election: కర్ణాటక ప్రజలకు బీజేపీ సూపర్ హామీలు.. ఫ్రీ గ్యాస్ సిలిండర్లతో?

Karnataka Election: దేశ ప్రధాన నరేంద్ర మోదీ కర్ణాటకలో గల్లీ గల్లీలో ప్రచారం చేస్తున్న సమయంలో బీజేపీ మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఆ మేనిఫెస్టోలో అన్నీ కూడా ఉచితాలే. ప్రతిరోజూ అరలీటర్ నందినీ పాలు కూడా ఉచితంగా ఇస్తామని చెప్పారు. కానీ చాలామందికి తెలియని అసలు విషయం ఏమిటంటే నందినినీ అమూల్ పరం చేయడానికి వేసిన ప్లాన్ అడ్డం తిరగడంతో ఈ రకంగా ప్రయత్నిస్తున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కూడా జన ఆకర్షణ కోసం అనేక రకాల పథకాలను ప్రకటిస్తోంది.

అయితే వాటిని మించి ఇప్పుడు బీజేపీ ఉచితాలను ప్రకటిస్తోంది. ఈ సారి రేషన్ బియ్యం కాకుండా సిరిధాన్యాలను ఇస్తామని చెబుతోంది. నిజం చెప్పాలి అంటే బీజేపీ మేనిఫెస్టో చూసిన వారికి కళ్లు బైర్లు కమ్ముతాయని చెప్పవచ్చు. ఉచితాల గురించి మోదీ చెప్పే మాటలు ఏమై పోయాయి అన్న వాదన కూడా గుర్తుకొస్తోంది. కర్ణాటకలో బీజేపీకి పూర్తి స్థాయిలో వ్యతిరేకత కనిపిస్తోంది. ముఖ్య మంత్రుల మార్పు వర్కవుట్ అయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. కులం మతంతో ఎంత రాజకీయం చేసినా చివరికి గడ్డు పరిస్థితులే ఎదురవుతున్నాయి.

 

కాగా గతంలో ప్రజలు అధికారం ఇవ్వకపోయినా ఇతరుల అధికారం లాక్కున్న బీజేపీకి ఈ సారి భారీ దెబ్బ తగలడం ఖాయం అన్న వాదనలు వినిపించడంతో పాటు వాదన రావడంతో అసాధ్యమైన హామీల లు తాము వ్యతిరేకమంటున్న ఉచితాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. మరి బీజేపీ కర్ణాటక మేనిఫెస్టో హామీలు ఫలిస్తాయా ప్రజలు వాటిని నమ్ముతారా అన్నది తెలియాలి అంటే వేచి చూడాల్సిందే మరి. కానీ బిజెపి పెట్టిన హామీలు మాత్రం అద్భుతంగా ఉన్నాయని చెప్పవచ్చు. కర్ణాటక ప్రజలకు బిజెపి సూపర్ హామీలను ఇస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -