Karnataka Elections: టీడీపీ జనసేన పొత్తును కర్ణాటక ఫలితాలు డిసైడ్ చేయనున్నాయా?

Karnataka Elections: మరో ఏడాదిలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఇప్పటికే ఎన్నికల హడావిడి కొనసాగుతుంది. ఈ క్రమంలోనే వైసిపి అధికారులు. ఎప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పొత్తు గురించి అధికారికంగా ప్రకటిస్తారా అని చాలా ఆందోళనగా ఎదురుచూస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ సైతం తరచూ చంద్రబాబు నాయుడుని కలవడంతో తప్పకుండా పొత్తు గురించి ప్రకటిస్తారని ఎదురుచూస్తున్నారు కానీ వీరు మాత్రం ప్రకటించడం లేదు.

పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీని బిజెపితో పొత్తు కుదుర్చుకున్నారని తెలుస్తోంది. అయితే వచ్చే ఎన్నికలలో టిడిపితో కూడా పొత్తు కుదుర్చుకోవాలని ఈ మూడు పార్టీలు కలిసి వచ్చే ఎన్నికలలో పోటీకి సిద్ధం కావాలని ఆలోచనలో ఉన్నారు కానీ ఈ విషయాన్ని మాత్రం వెల్లడించలేదు అయితే ఈ విషయాన్ని కర్ణాటక ఎన్నికలు ఫలితాలు వచ్చిన తర్వాత ప్రకటించబోతున్నారని తెలుస్తోంది.

 

ఈనెల 10వ తేదీ కర్ణాటకలో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. 13న ఫలితాలు రానున్నాయి. ఒకవేళ కర్ణాటకలో బిజెపి కనుక గెలిస్తే ఇక్కడ జనసేన పార్టీ బిజెపితో పొత్తు కుదుర్చుకొని వచ్చే ఎన్నికలలో పోటీకి సిద్ధం అయ్యే ఆలోచనలో జనసేన అధినేత ఉన్నట్లు తెలుస్తోంది ఒకవేళ కర్ణాటకలో కనుక బిజెపి ఓడిపోతే ఇక్కడ ఈయన తెలుగుదేశం పార్టీతో పొత్తు కుదుర్చుకోవడానికి సిద్ధమయ్యారని అందుకే కర్ణాటక ఎన్నికల ఫలితాలు వచ్చేదాకా వీరు పొత్తు గురించి ప్రకటించబోరని సమాచారం.

 

ఒకవేళ కర్ణాటకలో బిజెపి గెలిచి ఏపీలో జనసేన బిజెపి ఇద్దరు కలిసి ఎన్నికల బరిలో దిగిన టిడిపికి మాత్రం ఎలాంటి నష్టం రాకుండా చూస్తామని బిజెపి పార్టీ హామీ ఇవ్వాల్సి ఉంటుందని పవన్ కళ్యాణ్ షరతు పెట్టినట్టు సమాచారం. ఏది ఏమైనా పెద్ద ఎత్తున ప్రజలలో పాతుకుపోయిన వైసీపీ పార్టీని గద్దె దించడం కోసం తెలుగుదేశం బిజెపి జనసేన ఈ మూడు పార్టీలు తప్పకుండా కలిసే పోటీకి వస్తాయని భావిస్తున్నారు.మరి వీరి పొత్తు గురించి అధికారికంగా ఎప్పుడు ప్రకటించనున్నారో తెలియాల్సి ఉంది.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -