Ambati: నిన్ను మోసం చేసిన వాడు…ఒక్క అవ‌కాశం ఇస్తే రాష్ట్రాన్ని మోసం చేయ‌రా అమ్మా.. అంబటి ఏమన్నారంటే?

Ambati: అంబంటి రాంబాబు గత కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు ఈయన ప్రస్తుతం జల వనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈయన గత కొద్దిరోజులుగా సినిమాలకు సంబంధించిన విషయాల గురించి మాట్లాడుతూ పెద్ద ఎత్తున వార్తలో నిలుస్తున్నారు. బోలా శంకర్ సినిమాను తనను ఉద్దేశించి క్యారెక్టర్ ను క్రియేట్ చేశారు అంటూ ఈయన తీవ్ర స్థాయిలో సినిమాపై మండిపడ్డారు. ఈ క్రమంలోని పవన్ కళ్యాణ్ గురించి కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు.

ఇదిలా ఉండగా గత రెండు రోజుల క్రితం పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తన భర్త గురించి ఓ సంచలన మైనటువంటి పోస్ట్ చేసిన సంగతి మనకు తెలిసిందే. పవన్ కళ్యాణ్ తన విషయంలో వ్యవహరించిన తీరుతనకు బాధ కలిగించిన మిగతా విషయాలలో ఆయన ఎంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారని రేణు దేశాయ్ తెలియజేశారు.

 

ఆయన రాజకీయాలలోకి వచ్చింది డబ్బు కోసం కాదని డబ్బు అంటే ఆయనకు పిచ్చి లేదని పేదల సంక్షేమం కోసమే రాజకీయాలలోకి వచ్చారని రేణు దేశాయ్ తెలిపారు.ప్రజా సంక్షేమం కోసమే 11 సంవత్సరాల పాటు ఆయన తన కుటుంబాన్ని కూడా దూరం పెట్టారని ఈమె తెలిపారు. రాజకీయపరంగా నా మద్దతు పవన్ కళ్యాణ్ గారికి ఉంటుందని ఆయనకు ఒక అవకాశం ఇవ్వండి అంటూ రేణు దేశాయ్ ఒక వీడియో చేశారు..

 

ఇలా ఒకానొక సమయంలో తనని మోసం చేసినందుకు తన భర్త పట్ల విమర్శలు కురిపించిన రేణు దేశాయ్ ప్రస్తుతం తన మద్దతు తెలియజేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఈ క్రమంలోనే రేణు దేశాయ్ చేసిన వ్యాఖ్యలపై అంబటి రాంబాబు స్పందిస్తూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. నిన్ను మోసం చేసినవాడు ఒక అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని మోసం చేయరా అమ్మ అంటూ ఈయన మాట్లాడారు.తాళి కట్టి ప్రమాణాలు చేసిన భార్యని మోసం చేసిన తనకు సమాజం ఒక లెక్క అనే లాజిక్ వచ్చేలాగా. పవన్ కళ్యాణ్ లో మరో యాంగిల్ కూడా ఉంది అంటూ ఈ సందర్భంగా చేస్తున్నటువంటి ఈ కామెంట్స్ వైరల్ అయ్యాయి.

Related Articles

ట్రేండింగ్

The Land Titling Act: ఏపీ ఓటర్లకు అలర్ట్.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి తెలుసుకుని ఓటేస్తే బెటర్!

The Land Titling Act: ఆంధ్రప్రదేశ్ లో లోక్‌సభతో పాటు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఢిల్లీలో ఎవరు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రజల బతుకుల్ని ప్రభావితం చేస్తుంది. గతంలో ఏ ప్రభుత్వము...
- Advertisement -
- Advertisement -