Mahesh: ఆ కేసులో మహేష్ ను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఏం జరిగిందంటే?

Mahesh: టాలీవుడ్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో ఉంటూ ఉంటారు. ఇటీవల ఆర్ఆర్ఆర్ ఆస్కార్ నామినేషన్స్ కోసం మార్కెటింగ్ చేసుకోవడానికి రూ.కోట్లలో ఖర్చు పెట్టారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీలో కలకలం రేపాయి. అయితే మోగా ఫ్యామిలీ టార్గెట్‌గా తమ్మారెడ్డి భరద్వాజ చేసే విమర్శలు, ఆరోపణలు వివాదానికి దారితీస్తున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై విమర్శనస్త్రాలు ఆయన సంధిస్తున్నారు.

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో తమ్మారెడ్డి భరద్వాజ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహేష్ పైరసీ గురించి ధైర్యంగా వెళ్లి హీరోలా పట్టుకుంటే పోలీసులు అరెస్ట్ అంటూ హడావుడి చేశారని, అప్పుడు ఒక్కరు కూడా అండగా నిలవలేదని అన్నారు. పవన్ కల్యాణ్ ఒక్కరే కాస్త మద్దతు ఇచ్చారని, నీ వెంట ఉంటానని మహేష్ కు నోటి మాట ద్వారా చెప్పారని అన్నారు. అప్పటివరకు మహేష్ బాబు అన్ని కార్యక్రమాల్లో పాల్గొనేవాడని, ఆ తర్వాత ఏ కార్యక్రమానికి రానని చెప్పాడని అన్నాడు. ఒకప్పుడు అందరితో కలిసి మహేష్ బాబు ఉండేవాడని, ఇప్పుడు ఆయన పని ఆయన చూసుకుంటున్నాడని తమ్మారెడ్డి వ్యాఖ్యానించారు.

సినిమాల పైరసీ విషయంలో అప్పట్లో మహేష్ బాబుకు ఎవరూ కూడా తోడు నిలవలేదని అన్నారు. పవన్ కల్యాణ్ రాజకీయ పార్టీ పెట్టి పెడితే ఒక్కరూ కూడా అతడికి సినీ ఇండస్ట్రీ నుంచి మద్దతు తెలపలేదన్నారు. రిపబ్లిక్ సినిమా చాలా బాగుంటుందని, కానీ అప్పుడు పవన్ కల్యాణ్ స్పీచ్ కారణంగా ఓపెనింగ్స్ పడిపోయాయని అన్నారు. అక్కడ అలా పవన్ కల్యాణ్ మాట్లాడటం సరికాదన్నారు.

మంచి చెబితే చెడు అంటే తానేం చేస్తానని తమ్మారెడ్డి భరద్వాజ తెలిపారు. ప్రతి దానికి తనను అంటున్నారని అన్నారు. తానే మాట్లాడే ప్రతి మాటలను కాంట్రవర్సీ చేస్తున్నారని, అలా చేయడం సరైన పద్దతి కాదన్నారు. తాను రూ.80 కోట్లతో 10 సినిమాలు తీస్తానని అన్నారు. చిన్నవారు అయినా, పెద్దవారు అయినా ఇండస్ట్రీలో అందరినీ గౌరవించాలని, అందరినీ కలుపుకుని పోవాలని అన్నారు. తాను ఇప్పుడు మంచి నిర్మాతగా ఉన్నానంటే ఇండస్ట్రీనే కారణమన్నారు.

ఇండస్ట్రీని తక్కువ చేసి మాట్లాడాలనే ఉద్దేశం తనకు లేదని, అలా చేయడం వల్ల తనకు వచ్చే లాభం ఏమీ ఉండదని అన్నారు. తనను విమర్శించే వాళ్లను చూసి నవ్వుకుంటానని అన్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -