Rajamouli: రాజమౌళి సక్సెస్ కావడానికి కారణం ఏంటో తెలుసా?

Rajamouli: టాలీవుడ్ ప్రేక్షకులకు జక్కన్న రాజమౌళి గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ ఎన్నో సినిమాలకు ప్రాణం పోసి డైరెక్టర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచ స్థాయి డైరెక్టర్లు కుళ్లుకునే విధంగా రాజమౌళి వెలుగుతున్నాడు. నిజానికి సినిమాలో యాక్టర్లు ఎంత ముఖ్యమో.. ఆ సినిమాలో ఎమోషన్ కూడా అంతే ముఖ్యం.

ఎందుకంటే సినిమాలో ఎమోషన్ ప్రేక్షకుడిని బాగా ఆకట్టుకోవాలి. అప్పుడే ప్రేక్షకుడి కూడా థియేటర్ నుంచి ఒక తృప్తితో బయటకు వస్తాడు. అలాంటి ఎమోషన్ ను రాజమౌళి కనిపెట్టి ప్రేక్షకులకు కొంచెం కొంచెం గా డోస్ ఇవ్వడంలో చాలా బాగా పండిపోయాడు. రాజమౌళి సినిమాలో యాక్టర్లు, ఫైట్లు ఒక ఎత్తు అయితే ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యేలా ఎమోషన్ ను అందించడం లో కూడా మరో ఎత్తు అని చెప్పవచ్చు.

బాహుబలి సినిమాలో అటువంటి ఎమోషనల్ పాత్రలను రాజమౌళి ఒక రేంజ్ లో పండించాడు. ప్రపంచ స్థాయిలో ప్రతి ఒక్క ప్రేక్షకుడికి ఆ సినిమా ఎమోషనల్ గా బాగా టచ్ అయింది. అందుకే బాహుబలి సినిమా గురించి ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఇప్పటికీ చెప్పుకుంటూనే ఉంటాడు. ఇక బాహుబలి రికార్డును క్రాస్ చేసే సినిమా కూడా ఇప్పటికీ రాలేదు. ఇక ఇటీవల విడుదలైన బ్రహ్మాస్త్ర సినిమా చూస్తే.. రాజమౌళికి మిగతా డైరెక్టర్లకు ఉన్న తేడా ఇట్లే కనపడుతుంది.

బ్రహ్మాస్త్ర సినిమాలో అదిరిపోయే యాక్టర్లు, ఫైట్లు గ్రాఫిక్స్ ఇలా ప్రతి ఒక్కటి ప్రేక్షకుడిని ఆకట్టుకునే విధంగా ఉంది. ఇక ఈ సినిమాలో అందరూ సూపర్ స్టార్లే ఉన్నారు. ఇక ఎమోషన్ విషయం లో ఈ సినిమా చాలా మిస్ అయింది. డైరెక్టర్ అయాన్ ఎమోషనల్ ఇంపాక్ట్ ప్రేక్షకులకు ఇవ్వలేకపోయాడు. నిజానికి ఇది ఒక సూపర్ హీరో సినిమాలా ఉంది. డైరెక్టర్ మొత్తం హాలీవుడ్ సినిమాను ఫాలో అయ్యి తీసినట్లుగా అనిపిస్తుంది. కనుక రాజమౌళికి మిగతా దర్శకులకి తేడా ఈ విషయంలోనే కనిపిస్తుంది.

Related Articles

ట్రేండింగ్

AP Recruitments: ఎలాంటి రాతపరీక్ష లేకుండా రూ.50,000 వేతనంతో జాబ్.. ఎలా దరఖాస్తు చేయాలంటే?

AP Recruitments:  నిరుద్యోగులకు శుభవార్త, ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఏపీ ప్రభుత్వం జాబ్ నోటిఫికేషన్ ని తీసుకువచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్య వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ జిల్లా...
- Advertisement -
- Advertisement -