Akkineni Heroes: చిరంజీవి పాస్ నాగార్జున ఫెయిల్.. నాగ్ కొడుకులు అందుకే సక్సెస్ కాలేదా!

Akkineni Heroes:  సాధారణంగా గత రెండు దశాబ్దాలుగా సినిమా ఇండస్ట్రీలో నెపోటిజం అనేది ఎక్కువగా నడుస్తూ వస్తుంది. వారసత్వంగా ఇండస్ట్రీలో స్టార్ హీరో కూతుర్లు, కొడుకులు అడుగుపెట్టి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ వస్తున్నారు. ఇక వీరిలో కొంతమంది వారు అంతగా గుర్తింపు సంపాదించుకోలేక పోతున్నారు.

మరికొందరు వచ్చిన అవకాశాన్ని మంచిగా ఉపయోగించుకొని స్టార్ హీరో రేంజ్ లో ఇండస్ట్రీలో వెలుగు వెలుగుతున్నారు. ఇక విషయానికొస్తే టాలీవుడ్ అగ్రస్టార్ హీరో చిరంజీవి గురించి మనందరికీ తెలిసిందే. చిరంజీవి టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడుగా ఓ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక చిరంజీవి వారసుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇదే క్రమంలో చిరుత సినిమా ద్వారా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇక ఇటీవల దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా తో పాన్ ఇండియా స్టార్ గా ఓ వెలుగు వెలుగుతున్నాడు. ప్రస్తుతం వరుస సినీ ఆఫర్లను తన చేతిలో పెట్టుకొని ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలుగుతున్నాడు చరణ్. ఇక టాలీవుడ్ అగ్ర స్టార్ హీరో అక్కినేని నాగార్జున గురించి మనందరికీ తెలిసిందే. ఆయన ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటించి నటుడుగా ఓ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.

కానీ ఆయన వారసులు అక్కినేని అఖిల్, నాగచైతన్యలు స్టార్ హీరో స్థాయిలో ఇప్పటికీ గుర్తింపు తెచ్చుకోలేకపోతున్నారు. నిజానికి చెప్పాలంటే 50 కోట్ల కలెక్షన్ కూడా వీరిద్దరి హీరోలు క్రాస్ చేయలేకపోతున్నారు. మరి ఈ విషయంలో చిరంజీవి మంచి కథలను ఎంచుకొని చరణ్ కు కెరీర్ పరంగా మంచి కథలను సజెస్ట్ చేస్తాడు. కానీ అక్కినేని నాగార్జున కథల విషయంలో పూర్తిగా ఫెయిల్ అయితున్నట్లు, సరైన కథను ఎంచుకోక పోవడం వల్లనే తన వారసులు కూడా సక్సెస్ అవ్వలేకపోతున్నారని ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరి ఇప్పుడు వచ్చే సినిమాలతోనైనా నాగార్జున వారసులు స్టార్ హీరో హోదాను సొంతం చేసుకుంటారో లేదో.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -