Balakrishna: బాలయ్య కూతుళ్లు సినిమాల్లోకి రాకపోవడానికి కారణమిదేనా?

Balakrishna: నందమూరి బాలకృష్ణ.. ఈ పేరు టాలీవుడ్ ప్రపంచానికి పెద్దగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించి నటుడుగా ఓ గుర్తింపు సంపాదించుకున్నాడు. ఒకరకంగా చెప్పాలంటే నటన విషయంలో తండ్రికి తగ్గా కొడుకుగా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇక ఇండస్ట్రీలో బాలయ్య బాబు ఫ్యాన్స్ గురించి మనందరికీ తెలిసిందే. బాలయ్య బాబు థియేటర్ లో చెప్పే డైలాగులు ఒక రేంజ్ లో హడావిడి చేస్తాయి.

బాలయ్య ఇండస్ట్రీలోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా థగ్ లైఫ్ స్టైల్ లో మాట్లాడుతూ జనాలను ఒక రేంజ్ లో ఆకట్టుకుంటూ ఉంటాడు. ఈ కోవకు సంబంధించిన బాలయ్య వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో తెగ హడావిడి చేస్తూ ఉంటాయి. ఇక ఇటీవల బాలయ్య నటించిన అఖండ సినిమా ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుందో మనందరికీ తెలిసిందే. ఆ సినిమాలో బాలయ్య బాబు తన అద్భుతమైన నటనను కనబరిచాడు.

ప్రస్తుతం ఇతడు ఎన్బికే 107 అనే సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తుంది. కాగా ఈ సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు. అదేవిధంగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఎన్బికె 108 అనే ప్రాజెక్టు కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మొత్తానికి బాలయ్య సినిమా ఆఫర్ల విషయంలో కుర్ర హీరోలకు ఏమాత్రం తగకుండా వెలుగు వెలుగుతున్నాడు. ఇదే విధంగా నందమూరి ఫ్యామిలీలో పలు హీరోలు కూడా నటనపై బాగా ఆసక్తి చూపుతూ ఇండస్ట్రీలో హడావిడి చేస్తున్నారు.

కానీ బాలయ్య కూతుర్లు ఇంతవరకు సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టలేదు. మరి బాలయ్య బాబు కూతుర్లు ఇంతవరకు ఇండస్ట్రీలో ఎందుకు అడుగు పెట్టలేదు అని సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వస్తున్నాయి. అవేమిటంటే బాలయ్య బాబు కూతుర్లు ఇండస్ట్రీలో నటించడం వల్ల ఫ్యాన్స్ నుంచి వ్యతిరేకత వస్తుందని భావిస్తున్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా ఇండస్ట్రీలో హీరోయిన్ల గురించి గాసిప్స్ అంటూ వస్తూ ఉంటాయని.. కాబట్టి ఇటువంటి వాటిని ఉద్దేశించి నందమూరి ఆడబిడ్డలు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టడం లేదని నందమూరి ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Sai Dharam Tej-Swathi: సాయితేజ్, స్వాతిరెడ్డి మధ్య అలాంటి బంధం ఉందా.. విడాకుల వెనుక ట్విస్టులు ఉన్నాయా?

Sai Dharam Tej-Swathi:స్వాతి రెడ్డి, సాయి ధరమ్ తేజ్ ని స్టేజిపై ఒరేయ్ అని పిలవడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిన సంఘటన మంత్ ఆఫ్ మధు ట్రైలర్ ఈవెంట్లో జరిగింది....
- Advertisement -
- Advertisement -