Faima: ఎమోషనల్ అయిన జబర్దస్త్ ఫైమా.. ఏం జరిగిందంటే?

Faima: బుల్లితెర రియాలిటీ షో ‘బిగ్‌బాస్’ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఇప్పటివరకు 5 సీజన్లు విజయవంతం పూర్తి చేసుకున్న బిగ్‌బాస్.. సీజన్-6 కూడా స్టార్ట్ చేసి.. ముగింపు దశకు చేరుకుంది. ఇప్పటికే 13 వారాలు పూర్తి చేసుకోగా.. 14 వారంలోని అడుగు పెట్టింది. అయితే గతంలోకంటే ఈ సారి షో మొత్తం చప్పగా కొనసాగినట్లు అనిపిస్తోంది. ఈ సారి ప్రేక్షకులు కూడా షోను చూడటానికి ఆసక్తి చూపించలేదు. దాంతో ఈ సీజన్ అట్టర్ ఫ్లాప్ అయినట్లు ప్రేక్షకులు భావిస్తున్నారు. అయితే షో ఎలా జరిగినా.. ఎలిమినేషన్ రౌండ్స్ మాత్రం ఆసక్తికరంగానే నిలుస్తున్నారు. బిగ్‌బాస్ కంటెస్టెంట్లలో కొందరిని కావాలనే బయటకు పంపుతున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి.

 

 

కాగా, సీజన్-6లో జబర్దస్త్ ఫైమా కూడా కంటెస్టెంట్‌ ఎంట్రీ ఇచ్చి.. తనదైన శైలిలో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసింది. కానీ ఆదివారం జరిగిన ఎలిమినేషన్ రౌండ్‌లో ఊహించని విధంగా ఫైమా ఎలిమినేట్ అయింది. దాంతో ఫైమా ఫ్యాన్స్ నిరుత్సాహపడుతున్నారు. టాప్-5లో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా ఫైమా ఉంటుందని భావించిన వారికి నిరాశే మిగిలింది. ఈ విషయంలో ఫైమా కూడా బిగ్‌బాస్‌పై అసహనం వ్యక్తం చేసింది. హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత మొదటిసారిగా ఫైమా మీడియాలో ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆమె చేసిన కామెంట్లు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

 

ఈ సందర్భంగా ఫైమా ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ..‘బిగ్‌బాస్ షోలో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చినప్పుడు నాలో ఎలాంటి మైనస్ పాయింట్స్ లేవని అనుకున్నా. కానీ నాలో వెటకారం ఎక్కువని.. వెటకారంగా మాట్లాడుతాననే విషయం నాకే తెలియదు. హౌస్ నుంచి బయటికొచ్చిన తర్వాతే ఈ విషయం తెలిసింది. చాలా మంది ప్రేక్షకులు చెబుతున్నారు. వెటకారం వల్లే రాణించలేకపోయావని. అయితే షోలో స్ట్రాంగ్ కంటెస్టెంట్ మాత్రం రేవంతే. రేవంత్‌తో గొడవపడి ఉండకపోతే.. నేనూ షోలో కొనసాగేదాన్ని. కానీ నాకు అదే మైనస్ అయింది. టాప్-5‌లో ఎవరు ఉంటారో.. విన్నర్ ఎవరు అవుతారో నాకు తెలియదు. అది ప్రేక్షకుల చేతిలోనే ఉంది.’ అని ఆమె చెప్పుకొచ్చింది. బిగ్‌బాస్ సీజన్-6 స్టార్ట్ అయినప్పటి నుంచి రేవంత్ స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా ఉన్నారు. రేవంతే విన్నర్ అవుతాడని సోషల్ మీడియాలో రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

AP Roads: ఏపీలో రోడ్ల పరిస్థితిని చూపించి ఓట్లు అడిగే దమ్ముందా.. వైసీపీ నేతల దగ్గర జవాబులున్నాయా?

AP Roads:  ఒక రాష్ట్రం అభివృద్ధి బాటలో నడవాలి అంటే ముందుగా ఆ రాష్ట్రంలో మౌలిక సదుపాయాలన్నీ కూడా సక్రమంగా ఉండాలి మౌలిక సదుపాయాలు అంటే రోడ్లు కరెంట్ నీరు వంటి వాటివి...
- Advertisement -
- Advertisement -