Bigg Boss: బిగ్‌బాస్ హౌస్‌లో ఫైమాను తొక్కేస్తున్నారా.. వాస్తవాలివే!

Bigg Boss: బిగ్‌బాస్-6 ఫైనల్ ఎపిసోడ్ దగ్గర పడింది. దీంతో కంటెస్టెంట్లు ఫుల్ జోష్‌లో ఉన్నారు. మొన్నటివరకు తిన్నామా.. పడుకున్నామా.. తెల్లారిందా.. అనే కాన్సెప్ట్ తో ఉన్న కంటెస్టెంట్లు.. ఇప్పుడు కప్పు ఎలాగైనా కొట్టాలనే కసిలో కనిపిస్తున్నారు. తమ ఐడియాలజీ.. స్ట్రాటజీతో కప్ గెలిచేందుకు కష్టపడుతున్నారు. ఈ మధ్య బిగ్‌బాస్ ఇస్తున్న టాస్కుల్లోనూ చురుగ్గా పాల్గొని ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తున్నారు.

 

అయితే తాజాగా బిగ్‌బాస్ హౌస్‌లో కెప్టెన్సీ టాస్క్ జరిగింది. ఈ టాస్క్ లో బిగ్‌బాస్ పెద్ద మెలికే పెట్టాడు. దీంతో కంటెస్టెంట్లు తమ ఓన్ ఐడియాలజీని ఇంప్లిమెంట్ చేయాల్సి వచ్చింది. అయితే ఈ టాస్క్ లో జబర్దస్త్ కమెడియన్ ఫైమాకు తీవ్ర అన్యాయం జరిగింది. దీంతో ఫైమా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అసలేం జరిగిందని అనుకుంటున్నారా?  టాస్క్ లో భాగంగా బిగ్‌బాస్ గార్డెన్‌లో బీబీ ట్రాన్స్ పోర్ట్ అనే వాహనాన్ని ఏర్పాటు చేశారు. ఈ వెహికల్‌లో ఎవరు ముందు ప్రవేశించి.. హార్న్ మోగిస్తారో.. వారే కాప్టెన్. అలా ఎంపికైన కెప్టెన్ మిగిలిన కంటెస్టెంట్లలో ఒకరిని కెప్టెన్సీ టెండర్ కాకుండా ఆపవచ్చు. టాస్క్ లో కంటెస్టెంట్ ఆదిరెడ్డి హారన్ మోగించి కెప్టెన్సీ కంటెండర్‌గా నిలిచాడు.

 

అయితే ఆదిరెడ్డి తన గేమ్ స్ట్రాటజీతో మొదటి రౌండ్‌లోనే ఫైమాను టాస్క్ నుంచి తప్పిస్తాడు. దీంతో ఫైమా ఒక్కసారిగా ఫైర్ అయింది. కావాలనే మొదటి రౌండ్‌ నుంచి తప్పించారని, ఇలా అయితే తన గేమ్ ఎలా ఆడాలని ఆవేదన వ్యక్తం చేసింది. నిజానికి షోను చూసిన జనాలు కూడా అదే ఫీల్ అయ్యారు. ప్రతి టాస్క్‌ లో చురుగ్గా పాల్గొనే ఫైమాకు.. కావాలనే తొక్కేస్తున్నారని ఆరోపిస్తున్నారు.  అన్ని రౌండ్స్ పూర్తయ్యేసరికి కెప్టెన్సీ కంటెండర్స్ గా ఆదిరెడ్డి, రేవంత్, రోహిత్, శ్రీహాన్, ఇనయాలో.. ఆదిరెడ్డి, రేవంత్ మాత్రమే గట్టి పోటీదారులుగా కనిపిస్తున్నారని. మిగిలిన వాళ్లు డమ్మీ కంటెస్టెంట్లుగా ఉన్నారని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: పవన్ కోసం పిఠాపురంలో 40 మంది పుష్పలు.. వైసీపీ ఆ రేంజ్ లో ప్లాన్ చేసిందా?

Pawan Kalyan:  ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రచారాల జోరు పెంచారు రాజకీయ నాయకులు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా వరుసగా ప్రచార సభలలో పాల్గొంటున్నారు ఈ సందర్భంగా ఆయన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్...
- Advertisement -
- Advertisement -