Faima: స్ట్రాంగ్‌ అనుకున్న కంటెస్టెంట్లనే ఎలిమినేట్ చేస్తున్నారు: ఫైమా

Faima: బుల్లితెర రియాలిటీ షో ‘బిగ్‌బాస్’ తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్రజాధారణ పొందుతోంది. ఇప్పటికే 5 సీజన్స్ విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో.. ప్రస్తుతం 6వ సీజన్ కొనసాగుతోంది. ఇది కూడా చివరి దశకు చేరుకుంది. మరో రెండు వారాల్లో సీజన్ ముగుస్తుంది. శనివారం, ఆదివారం రోజు బిగ్‌బాస్‌లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. కంటెస్టెంట్ రేవంత్ తొందరపాటు వల్ల ‘టికెట్ టు ఫినాలే’ అవకాశాన్ని చేజార్చుకున్నాడు. దాంతో ఆ ఛాన్స్ శ్రీహాన్‌కు వెళ్లింది. ఏ పోటీ లేకుండా శ్రీహాన్ ఫైనల్స్ కి వెళ్లిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

ఆదివారం జరిగిన ఎలిమినేషన్ రౌండ్‌లో రోహిత్, ఇనయా, కీర్తి సేఫ్ అయ్యారు. కానీ ఫైమా ఎలిమినేషన్ అయింది. అయితే వారం క్రితమే రాజ్ కంటే ఫైమాకు తక్కువ ఓట్లు వచ్చాయని అనౌన్స్ చేశారు. ఈ క్రమంలో ఫైమా ఎలిమినేషన్ ఉంటుందని ఎవరూ ఊహించలేదు. ఈ సందర్భంగా ఫైమా మాట్లాడుతూ.. ‘స్ట్రాంగ్ అనుకున్న కంటెస్టెంట్లే త్వరగా ఎలిమినేట్ అవుతున్నారు. అసలు ప్రేక్షకులు ఆట చూసి ఓట్లు వేస్తున్నారా? ప్రచారాలు చూసి ఓట్లు వేస్తున్నారా? అర్థం కావట్లేదు. రేవంత్ గురించి నేనేం తప్పుగా మాట్లాడలేదు. రేవంత్ మాట్లాడిన మాటలకే బదులిచ్చాను. ఆ విషయంలో నేను తప్పు చేశానని అనుకోవట్లేదు. ఈ వారం నేను ఎలిమినేట్ అవుతానని కూడా అస్సలు ఊహించలేదు. ప్రతీసారి ఎలిమినేషన్ విషయంలో అనుమానాలు తలెత్తుతూ వస్తున్నాయి. టీఆర్‌పీ పెంచుకునే విషయంలో బిగ్‌బాస్ షో నిర్వాహకులు కంటెస్టెంట్లకు వేసే ఓట్లు మార్చినట్లు ప్రచారం జరిగింది. ఇందులో ఎంత వాస్తవముందే తెలియాలి.’ అని ఫైమా అసహనం వ్యక్తం చేసింది. కాగా, ఫైమా కెరీర్‌కి బిగ్‌బాస్ చాలా ప్లస్ కానుందని ప్రచారం జరుగుతోంది. టాప్‌-5లో ఉంటుందని అనుకున్న ఫైమా.. త్వరగా బయటికి రావడం అభిమానుల్లో నిరాశను మిగిల్చింది. మరోవైపు ఇన్ని వారాలు ఫైమా బిగ్‌బాస్ హౌస్‌లో ఉండటం గ్రేట్ అని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -