YCP Minister: వైరల్ అవుతున్న వైసీపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు!

YCP Minister: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 2024 లో జరగబోయే ఎలక్షన్స్ కోసం రాజకీయ పార్టీలో ఇప్పటినుండి ప్రచారం మొదలుపెట్టాయి. తాజాగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వారాహీయాత్ర ప్రారంభించాడు. పవన్ కళ్యాణ్ ఒకవైపు వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నప్పటికీ రాబోయే ఎలక్షన్స్ లో తన పార్టీని గెలిపించడం కంటే వైసిపి పార్టీని గద్దె దించాలన్న ఉద్దేశంతోనే ప్రచారం చేస్తున్నాడు. ఎక్కడ చూసినా కూడా అధికార పార్టీని ఉద్దేశిస్తూ విమర్శలు చేస్తున్నాడు.

ఈ క్రమంలో కొంతమంది వైసీపీ నాయకులకు కూడా పవన్ కళ్యాణ్ విమర్శలకు గట్టిగా సమాధానాలు చెబుతున్నారు. అయితే ఒక వైసీపీ మంత్రి మాత్రం పవన్ కళ్యాణ్ ని సీఎంగా చూడాలనే తన కోరికని దైవసాక్షిగా బయటపెట్టాడు. ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం జ‌న‌సేన‌, వైసీపీ మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నే ప‌రిస్థితి ఉంది. ఈ తరుణంలో ప‌వ‌న్‌ను సీఎంగా చూడాల‌ని ఏపీ మంత్రి విశ్వ‌రూప్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

 

మంత్రి విశ్వరూప్ తాజగా శ‌నివారం తిరుమ‌ల శ్రీ‌వేంక‌టేశ్వ‌రస్వామిని ద‌ర్శించుకున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ మీద అభిమానం చాటుతు పవన్ కళ్యాణ్ ని ఆంధ్రప్రదేశ్ కి సీఎంగా చూడాలనే తన కోరికని తెలియజేశాడు. ఈ క్రమంలో 175 సీట్ల‌లో పోటీ చేసి 88 స్థానాల‌ను ద‌క్కించుకుని సీఎం కావాల‌ని పవన్ కళ్యాణ్ కి విశ్వ‌రూప్ సూచనలు ఇచ్చాడు. ప‌వ‌న్ అభిమానులే కాదు, త‌న‌కు కూడా ప‌వ‌న్‌ను సీఎంగా చూడాల‌ని వుంద‌ని మంత్రి చెప్పుకొచ్చాడు.

 

పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తులో భాగంగా 100 స్థానాల్లోనైనా పోటీ చేసి 50 స్థానాల్లోనైనా గెలవాలని మంత్రి సూచించ‌డం విశేషం. మరోవైపు ప‌వ‌న్‌క‌ల్యాణ్ కూడా ఇటీవల అమ‌లాపురంలో వారాహి యాత్ర నిర్వ‌హించారు. అయితే ఆ సమయంలో మంత్రి విశ్వ‌రూప్‌పై పెద్ద‌గా విమ‌ర్శ‌లు చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. అయితే విశ్వ‌రూప్ ఆశించిన‌ట్టు సీఎం కావాలంటే ప‌వ‌న్ చిక్కుల్లో ప‌డాల్సి వ‌స్తుందనీ పలువురు భావిస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -