Raadhika: ఆ టాలీవుడ్ స్టార్ పేరు మనవడికి పెట్టిన రాధిక.. ఏమైందంటే?

Raadhika: సినిమా ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు రాధిక. ఈ సీనియర్ నటి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈమె తమిళ భాషలో మాత్రమే కాకుండా తెలుగులో సూపర్‌ హిట్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. అగ్ర హీరోలు అందరి సరసన నటించి అద్భుతమైన సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే తనకు ఇష్టమైన హీరో ఎవరని ఇంటర్వ్యూలో అడగ్గా.. ఆ యంగ్‌ హీరో పేరు చెప్పి అందరికీ షాక్‌ ఇచ్చింది.

 

టాలీవుడ్ ఇండస్ట్రీలో మీకు ఇష్టమైన హీరో ఎవరు అని ప్రశ్నించగా రాధిక ఎన్టీఆర్ పేరు చెప్పేశారు. తనకు ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టమని ఆయనపై ఉన్న ఇష్టంతోనే తన మనవడికి కూడా తారక్ అనే పేరు పెట్టుకున్నామని తెలిపారు. ఇక ఎంతో ఇష్టమైన హీరోని మీరు ఎన్నిసార్లు కలిశారు అంటూ ప్రశ్నించగా తాను ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఎన్టీఆర్‌ను కలవలేదన్నారు. తనకు ఎప్పటికైనా తనని కలసి తనతో ఒక సినిమాలో నటించాలన్నదే తన కోరిక అంటూ రాధిక తెలియజేశారు.

 

 

తారక్ నటన ఎంతో అద్భుతంగా ఉంటుందని రాధిక పొడిగారు.తెరపై ఆయనని చూస్తే అలాగా ఉండిపోతామని తెలిపారు. ఇక తనలో మంచి డాన్సర్ కూడా దాగి ఉన్నారని రాధిక ఎన్టీఆర్ నటనపై ప్రశంసలు కురిపించారు. ఇక ఎన్టీఆర్‌కి తల్లిగా నటించాలని ఉందా అత్తగా నటించాలని ఉందా అంటూ ప్రశ్నించగా ఏదో ఒకటి తనకు ఎన్టీఆర్ సినిమాలో నటించే అవకాశం వస్తే చాలంది. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌పై తనకు ఉన్నటువంటి అభిమానం గురించి రాధిక కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Related Articles

ట్రేండింగ్

AP Roads: ఏపీలో రోడ్ల పరిస్థితిని చూపించి ఓట్లు అడిగే దమ్ముందా.. వైసీపీ నేతల దగ్గర జవాబులున్నాయా?

AP Roads:  ఒక రాష్ట్రం అభివృద్ధి బాటలో నడవాలి అంటే ముందుగా ఆ రాష్ట్రంలో మౌలిక సదుపాయాలన్నీ కూడా సక్రమంగా ఉండాలి మౌలిక సదుపాయాలు అంటే రోడ్లు కరెంట్ నీరు వంటి వాటివి...
- Advertisement -
- Advertisement -