Adipurush Release Trailer: ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పిస్తున్న ఆదిపురుష్ రిలీజ్ ట్రైలర్.. భలే ఉందిగా!

Adipurush Release Trailer: టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ కృతి సనన్ కలిసిన నటించిన తాజా చిత్రం ఆదిపురుష్. దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా గత ఏడాది విడుదలైన టీజర్ కి నెగిటివ్ టాక్ రావడంతో పాటు తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో ఈ సినిమాలో కొన్ని మార్పులు చేర్పులు చేశారు. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ప్రభాస్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని తిరుపతిలో గ్రాండ్ గా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

ఇక వేదిక ప్రాంగణం అంతా కూడా అభిమానులతో దద్దరిల్లిపోయింది. మొదట దేవుడికి సంబంధించిన డ్యాన్స్ పర్ఫామెన్స్ లతో ఈ ప్రోగ్రాం ని ఘనంగా మొదలుపెట్టారు. ఆ తర్వాత డాన్సులు పాటలతో హోరెత్తించారు. ఇక ఆ సంగతి పక్కన పెడితే ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆది పురుష్ సినిమా ట్రైలర్ రానే వచ్చింది. ఈ సందర్భంగా చిత్రబృందం ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేశారు. ఇక ఆ ట్రైలర్ లో ప్రభాస్ డైలాగులు, సన్నివేశాలు ప్రతి ఒక్కరికి కూడా గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో గా మారింది.

 

ఆ వీడియోలో సైఫ్ అలీ ఖాన్ ,కృతి సనన్ దగ్గరికి వెళ్లి బిక్షాందేహి అని అడుగుతాడు. అప్పుడు సీతను రావణాసురుడు తీసుకెళుచుండగా ప్రభాస్ వస్తున్నా రావణ.. న్యాయం రెండు పాదాలతో నీ పదితలల అన్యాయాన్ని అనిచివేయడానికి, వస్తున్నా నా జానకి తీసుకువెళ్లడానికి, నా ఆగమనం, అధర్మ విధ్వంసం అంటూ ప్రభాస్ చెప్పే డైలాగ్ లు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి.. ట్రైలర్ ని చూసిన ప్రేక్షకులు సినిమా హిట్ అవ్వడం ఖాయం అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్ కి వస్తున్న రెస్పాన్స్ ని బట్టి చూస్తుంటే. ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందిఅనడంలో ఎటువంటి సందేహం లేదు. ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పిస్తున్న ఆదిపురుష్ రిలీజ్ ట్రైలర్.. భలే ఉందిగా!

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -