Balakrishna: బాలకృష్ణకు తన భార్య వసుంధర ఇచ్చిన పెళ్లి కట్నం చూస్తే మతి పోవాల్సిందే!

Balakrishna: నందమూరి బాలకృష్ణ తెలుగు చలనచిత్రం నటుడుగా అందరికీ సుపరిచితమే. ఈయన స్వర్గీయ ఎన్టీఆర్ గారి చిన్న కొడుకుగా కూడా అందరికీ సుపరిచితమే. బాలకృష్ణ 14 సంవత్సరాల వయసులోనే సినీ ఇండస్ట్రీకి బాల నటుడిగా పరిచయమయ్యాడు.

తెలుగు ఇండస్ట్రీలో వరుస అవకాశాలతో రాణిస్తూ తన నటనకు మంచి గుర్తింపు పొంది 100 చిత్రాలకు పైగా నటించడం జరిగింది. తెలుగు ఇండస్ట్రీలో అగ్ర హీరోగా రాణిస్తూ నట సింహం గా మారారు. అయితే బాలయ్య పెళ్లికి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో చేరింది.

బాలకృష్ణ సినిమాలలో బిజీగా రాణిస్తున్న సమయంలో, ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న రోజులలో బాలకృష్ణ తల్లి బసవతారకం బాలకృష్ణ కు పెళ్లి చేయాలని భర్త పై ఒత్తిడి తెచ్చారట. ఎన్టీఆర్ బిజీగా ఉండడంతో బాలకృష్ణ పెళ్లి బాధ్యతను తన సహచరుడైన నాదెండ్ల భాస్కరరావుకు అప్పగించారట ఎన్టీఆర్ గారు.

నాదెండ్ల భాస్కరరావు తన బంధువైన దేవరపల్లి సూర్యారావు కూతురైన వసుంధరను చూపించడంతో, అందరికీ నచ్చి వెంటనే ఓకే చెప్పేశారట. ఇక 1982 డిసెంబర్ 8న ఘనంగా వివాహం జరిగింది. కానీ ఇందులో విశేషమేమిటంటే బాలకృష్ణ పెళ్లి కోసం ఎలాంటి కట్నం తీసుకోలేదట.

తన మామగారు శ్రీరామదాసు మోటర్ ట్రాన్స్ పోర్ట్ ఓనర్… తన అల్లుడు బాలకృష్ణ కు పెళ్లి కానుకగా 10 లక్షలు పెట్టి హైదరాబాదులో ఇల్లు కట్టించారట. ఇక బాలకృష్ణకు ముగ్గురు పిల్లలు సంతానం. వీరు బ్రాహ్మణి, తేజస్విని, కుమారుడు మోక్షజ్ఞ. బ్రాహ్మణిని చంద్రబాబు కుమారుడు అయిన నారా లోకేష్ కు ఇచ్చి వివాహం చేసిన సంగతి అందరికీ తెలిసిందే.

ఇక తేజస్వినిని గీతం యూనివర్సిటీ ఎండి భరత్ కు ఇచ్చి వివాహం చేశారు. ఇక బాలకృష్ణ నటించిన అఖండ సినిమా భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఒక సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నట్లు సమాచారం.

Related Articles

ట్రేండింగ్

YSRCP: అయిదేళ్లలో మూడు రెట్లు పెరిగిన వైసీపీ నేతల ఆస్తులు.. మరీ ఇంత అవినీతిపరులా?

YSRCP: వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైకాపా నేతల అక్రమాలు మొదలయ్యాయి ఇష్టానుసారంగా చేతికి దొరికినది దోచుకుంటూ సొమ్ము చేసుకున్నారు. 2019 ఎన్నికల ముందు వరకు కనీసం ఆస్తిపాస్తులు లేనటువంటి వారు...
- Advertisement -
- Advertisement -