Karnataka: కాబోయే భర్తను కత్తితో పొడిచిన భార్య.. ఎందుకంటే?

Karnataka: తాజాగా కర్ణాటకలో ఒక దారుమైన ఘటన చోటు చేసుకుంది. కర్ణాటక హవేరి జిల్లాలోని ఒక ప్రాంతానికి చెందిన ఒక యువతి తల్లిదండ్రులతో పాటు నివసిస్తోంది. కూతురుకి పెళ్లి వయసు రావడంతో ఆ యువతి తల్లిదండ్రులు పెళ్లి చేయాలని అనుకున్నారు. ఈ క్రమంలోనే హర్పనహళ్లి ప్రాంతానికి చెందిన దేవేంద్రగౌడ అనే 23 ఏళ్ళ యువకుడితో గత నెల మార్చి 3న నిశ్చితార్థం జరిపించారు. ఇక పెళ్లి కూడా తొందరలోనే ఉండడంతో వివాహ పనుల్లో బిజీగా మారిపోయారు.

ఇదిలా ఉంటే తాజాగా ఆ యువతి కాబోయే భర్తకు ఫోన్ చేసి ఇద్దరం పార్కుకు వెళ్దామని చెప్పింది. దాంతో దేవేంద్ర గౌడ సంతోషంతో కాబోయే భార్య దగ్గరికి వెళ్ళాడు. ఇద్దరు కలిసి సరదాగా పార్క్ కి వెళ్లి ఎంజాయ్ చేశారు. ఇక ఎంజాయ్ చేసిన తర్వాత రీల్స్ చేద్దామని చెప్పగా అందుకు దేవేంద్ర సరే అని అన్నాడు. అప్పుడు ఆ యువతి నువ్వు నీ చేతులు తాళ్లతో కట్టుకుని ఉంటే నేను వీడియో తీస్తానని చెప్పింది. ఆమె చెప్పినట్టే దేవేంద్ర సరే అనడంతో ఆ యువతి అతని చేతులను తాళ్లతో కట్టేసింది. ఆ తర్వాత అటు వైపుకు తిరగమని చెప్పడంతో అతడు ఆమె చెప్పినట్టే వెనక్కి తిరగగా వెంటనే ఆ యువతి తనతో తెచ్చుకున్న కత్తితో కాబోయే భర్త మెడపై పొడిచింది.

అప్పుడు యువకుడు పెద్దగా కేకలు వేయడంతో పార్క్ లో స్థానికులు అక్కడికి రావడంతో వెంటనే ఆ యువతి అక్కడి నుంచి పరార్ అయింది. స్థానికులు దేవేంద్రనీ స్థానిక ఆసుపత్రికి తరలించారు. కాగా విషయం తెలుసుకున్న దేవేంద్ర తల్లిదండ్రులు హుటాహుటిన ఆస్పత్రిలో ఉన్న దేవేంద్రగౌడను చూసి కన్నీటి పర్యంతమయ్యారు. ఇక జరిగిన దారుణంపై దేవేంద్రగౌడ కుటుంబ సభ్యులు ఆ యువతిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ యువతిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆ యువతీని పోలీసులు విచారించగా ఆమె ఒక షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. అప్పటికే తాను వేరే అతడిని ప్రేమిస్తున్నానని తనకు ఇష్టం లేకపోయినా తల్లిదండ్రులు దేవేంద్రతో నిశ్చితార్థం చేశారని అందుకే అలాంటి దారుణానికి ఒడిగట్టినట్లు ఆ యువతీ తెలిపింది. ప్రస్తుతం దేవేంద్ర హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నాడు..

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -