Kerala: అన్నం దొంగిలించిన యువకుడు.. ఎవరికి?

Kerala: అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అంటూ ఉంటారు. చాలామంది అన్నం విలువ తెలియక అన్నాన్ని పారేస్తూ ఉంటారు. కానీ సమాజంలో చాలామంది అదే అన్నం దొరకకా కడుపు మాడ్చుకొని అన్నం లేక ఆకలితో అలమటిస్తున్నారు. చాలామంది తినడానికి తిండి లేక చనిపోతున్నారు. సమాజంలో చాలామంది ఆకలి బాధలు చూసిన కొంతమంది గొప్ప గొప్ప వ్యక్తులు వారి ఆకలి బాధను తీరుస్తూ ఉంటారు. అన్నం దొంగలిస్తే ఎవరైనా చంపేస్తారా? ఈ మాట వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ..


కానీ ఒక వ్యక్తిని అన్నం దొంగలించాలని చంపేశారు కొందరు దుండగులు. పూర్తి వివరాల్లోకి వెళితే..

2018లో కేరళలో అన్నం, కూర దొంగిలాంచాడని ఒక ఆదివాసి వ్యక్తిని కొందరు వ్యక్తులు దారుణంగా కొట్టిన విషయం తెలిసిందే. వీరి దాడిలో ఆ అమాయక యువకుడు చివరికి ప్రాణాలు కోల్పోయాడు. కాగా ఈ ఘటన అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. వారి కొడుకుని అన్యాయంగా కొట్టి చంపారని మృతుడి తల్లి గుండెలు పగిలేలా రోదించింది.

 

ఇక ఈ కేసు కోర్టు వరకు వెళ్లడంతో అప్పుడే ఒక వ్యక్తికి జైలు శిక్ష కూడా విధించింది. కాగా ఈ కేసును విచారణ చేపట్టిన కేరళలోని స్పెషల్ కోర్టు తాజాగా సంచలన తీర్పును వెల్లడించింది. ఈ కేసులో మిగిలిన 13 మంది నిందితులకు కూడా ఏడళ్ల పాటు జైలు శిక్ష విధిస్తున్నట్లు తీర్పును వెలువరించింది. అంతేకాకుండా దోషులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల జరిమానా విధించింది. దీంతో పాటు జరిమానాలో సగం మృతుడి తల్లికి ఇవ్వాలని కూడా తెలిపింది. కోర్టు తీర్పుతో మృతుడి తల్లి, కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -