Devotional: పనిమీద వెళుతున్నప్పుడు ఈ జంతువులు ఎదురొచ్చాయా?

Devotional: టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న కూడా ఇప్పటికీ భారత దేశంలో ఆచారాలు సంప్రదాయాలు మూఢనమ్మకాలను నమ్ముతూనే ఉన్నారు. భారతీయులు ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఆచార సంప్రదాయాల ప్రకారం ఒక పద్ధతి ప్రకారం జరిపిస్తూ ఉంటారు. ఏదైనా శుభకార్యం మొదలు పెట్టాలన్న, బయటికి వెళ్లాలన్నా సమయం తేదీ ఘడియలు అంటూ మంచి ఘడియలు ఉన్న సమయంలోనే శుభకార్యాలను ఎక్కువగా మొదలు పెడుతూ ఉంటారు.

మరి ముఖ్యంగా హిందువులు బయటికి వెళ్లే సమయంలో కొందరు మనుషులు కొన్ని రకాల పక్షులు,జంతువులు, వస్తువులు కనిపిస్తే అశుభంగా భావిస్తూ ఉంటారు. దీనినే శకున శాస్త్రం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఏదైనా జంతువు లేదా పక్షి నుండి వచ్చే సంకేతాల ఆధారంగా భవిష్యత్తులో జరిగేది మంచి లేదా చెడు అనే దాని గురించి ఒక అంచనా వేయవచ్చు. హిందువులు ఆవును ఎంతో పవిత్రంగా భావించడంతోపాటు గోమాతగా పిలుస్తూ పూజిస్తూ ఉంటారు. ఏదైనా పని మీద బయటకు వెళ్తున్నప్పుడు దారిలో ఎక్కడైనా ఆవు దూడకు పాలు ఇవ్వడం కనిపిస్తే వెళుతున్న పని విజయం అవుతుంది.

 

అదేవిధంగా శకున శాస్త్ర ప్రకారం ఏదైనా ఇంట్లో పిల్లి ప్రసవించడం అన్నది శుభప్రదంగా భావిస్తారు. అలా పిల్లి ఇంట్లో ప్రసవించడాన్ని త్వరలో సంపద రాబోతుంది అన్న దానికీ సంకేతంగా భావించాలి. పిల్లి మీ ఇంటి చుట్టూ పక్కల ఏడుస్తూ కనిపిస్తే మాత్రం ఏదైనా ఆపదకు కారణంగా చెప్పవచ్చు. అలాగే బయటకు వెళ్తుంటే పిల్లి ఎదురైనా సరే ఆ పని మధ్యలోనే ఆగిపోతుంది. బయటకు వెళ్తున్నప్పుడు పిల్లి ఎదురు రావడం అంత మంచిది కాదు. అలాగే ఉదయాన్నే బయటికి వెళ్తున్నప్పుడు హంస,తెల్ల గుర్రం, చిలక, నెమలి కనిపిస్తే శుభ సూచికంగా భావించడంతోపాటు మీరు వెళ్తున్న పనులు సక్రమంగా జరుగుతాయి.

 

మీరు పని మీద బయటకు వెళ్తున్నప్పుడు మీకు దారిలో బురదలో పొర్లిన పంది కనిపిస్తే అది శుభసూచికంగా భావించాలి. కానీ బురద ఎండి పోయి ఉంటే దాని ఆశుభ సూచికంగా భావించాలి. అలాగే కాకి ఇంటి మీద పదేపదే అరుస్తూ ఉంటే ఇంటికి అతిధులు వస్తారని అర్థం. కాకి తలపై లేదంటే భుజంపై తన్ని వెళితే దాన్ని చెడు సంకేతంగా భావించాలి. అది డబ్బు నష్టం లేదంటే ఏదైనా వ్యాధికి సంకేతంగా కూడా భావించాలి. శకున శాస్త్రం ప్రకారం ఇంటి నుండి బయలు దేరేటప్పుడు మీ ముందు లేదా వెనుక గాడిద శబ్దం చేస్తే దానిని అశుభ సంకేతంగా భావించాలి.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు పోటీ అదే పేర్లతో ఉన్న ఇద్దరు పోటీ.. వైసీపీ కుట్ర చేస్తోందా?

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల త్వరలోనే జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఎన్నికల హడావిడి నెలకొంది. ఈ క్రమంలోనే ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తి అయింది. అయితే ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో ఒక్కో...
- Advertisement -
- Advertisement -