Pawan Kalyan: పవన్ కు ఎక్కువ సీట్లు ఇచ్చే ఆలోచన లేదా.. ఏం జరిగిందంటే?

Pawan Kalyan: ఏపీలో తాజాగా జరిగిన పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఏపీలో ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా తెలుగుదేశం పార్టీ హవానే కనిపిస్తోంది. అయితే ఎమ్మెల్సీ నిధులు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా రావడం అన్నది టీడీపీ కీ లాభమా నష్టమా అన్నది ప్రస్తుతం అర్థం కావడం లేదు. చాలామంది తెలుగుదేశం పార్టీ వాళ్లు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తప్పకుండా టిడిపి పార్టీ నేను తెలుస్తుంది అంటూ అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నారు.

కాగా తమ పార్టీ అపరిమితంగా బలపడిపోయిందని, ఇక ఎవరినీ ఖాతరు చేయవలసిన అవసరం లేదని కొందరు నాయకులు తలపోస్తున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల సమయానికి ఇతర పార్టీలతో కలిసి సమిష్టిగా పోటీ చేయాలనుకుంటున్న తెలుగుదేశం పార్టీ అధిష్టానం వైఖరికి పార్టీ నాయకుల శ్రేణుల మనోభిప్రాయాలు భిన్నంగా ఉన్నాయి. వచ్చే ఎన్నికల సమయానికి తెలుగుదేశం జనసేనతో చట్టపట్టాలు వేసుకుని జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి సిద్ధపడుతున్న మనందరికీ తెలిసిందే. అయితే జనసేనకు ఎన్ని సీట్లు పంచాలి అనే దగ్గరే ఆ రెండు పార్టీల మధ్య చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి.

 

చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ప్రాథమిక చర్చలలో కేవలం 20 సీట్లు మాత్రం పవన్ కళ్యాణ్ కు కేటాయించడానికి చంద్రబాబు అంగీకరించినట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అయితే కేవలం 20 సీట్లు అంటే చాలా అవమానకరంగా ఉంటుందనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ తమ పార్టీ తరఫున వారికి ఇంకా అధికారిక మద్దతు ప్రకటించలేదు. వారితో కొత్తగా పొత్తు బంధం పెట్టుకోబోతున్నట్లు కూడా అధికారికంగా వెల్లడించలేదు. కేవలం 20కి నేను ఒప్పుకుంటానా? సీట్ల సంఖ్య ఇంకా మాట్లాడలేదు అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. కాబట్టి ఇంకొద్దిగా సీట్లు ఎక్కువ లబ్ధి పొందడానికి వ్యవహారాన్ని సాగదీస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో వచ్చిన పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు తెలుగుదేశం పార్టీ నాయకులలో కొత్త ఉత్సాహం నెలకుంది. దీంతో తెలుగుదేశం పార్టీ వాళ్ళ మాటలు అప్పుడే మారిపోయాయి. మొత్తానికి జనసేన కు 20 సీట్లే ఎక్కువ అని చంద్రబాబు డిసైడ్ అయినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Viveka Case: వివేకా హత్య కేసులో మరో షాకింగ్ ట్విస్ట్.. ఆ పరీక్ష కీలకమా?

Viveka Case: వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో భాగంగా రోజురోజుకు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇలా ఆయన హత్య కేసులో నిందితులను కనుగొనడం కోసం సిబిఐ అధికారులు పెద్ద ఎత్తున...
- Advertisement -
- Advertisement -