Actress: ఈ ఏడాది పెళ్లి చేసుకుని షాకిచ్చిన సెలబ్రిటీలు వీళ్లే!

Actress: సినీ ఇండస్ట్రీలో 2022 లో చాలామంది హీరోయిన్లు హీరోలు పెళ్లి పీటలు ఎక్కిన విషయం తెలిసిందే. ఒకరి తర్వాత ఒకరు వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు. మరి ఈ ఏడాది ఎవరెవరు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. బాలీవుడ్ క్యూట్ కపుల్ అలియా భట్, హీరో రణబీర్ కపూర్ జంట ఈ ఏడాది ఏప్రిల్ 14, 2022 న వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్ళికి ముందే కొద్దిరోజులపాటు డేటింగ్ చేసిన ఈ జంట ఆ తర్వాత వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు. అలాగే ఈ జంట ఇటీవల ఓ ఆడ బిడ్డకు కూడా జన్మనిచ్చింది.

అప్పుడే కూతురి పేరును కూడా పెట్టేసారు. కూతురి పేరు రాహా. అలాగే మరొక బాలీవుడ్ హీరోయిన్ నటి మౌని రాయ్ దుబాయ్ కు వ్యాపారవేత్త సూరజ్ నంబియార్‌ ను జనవరి 27న గోవాలో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. పలు హిందీ సీరియల్స్‌ తో పాటు సినిమాలలో కూడా నటించింది. అలాగే లేడీ సూపర్ స్టార్ నయనతార విగ్నేష్ శివన్ జంట ఒకటే నిమిషం తెలిసిందే. ఈ ఏడాది జూన్ 10న ఈ జంట మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. అలాగే వీరు పెళ్లైన నాలుగు నెలలకే సరోగసి ద్వారా కవల పిలలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అలాగే నటి రిచా చద్దా, అలీ ఫజల్ ల ఈ సెప్టెంబర్ 30న వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

అలాగే టాలీవుడ్ హీరోయిన్ హన్సిక డిసెంబర్ 4న ముంబై వ్యాపార వేత్త సోహైల్‌ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. సింధీ సంప్రదాయం ప్రకారం పెళ్లి జరిగింది. బంధువులు, స్నేహితుల సమక్షంలో వీరి పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. అలాగే టాలీవుడ్ ప్రముఖ నటి పూర్ణ అలియాస్ షమ్నా కాసిం, దుబాయ్ కు చెందిన వ్యాపారవేత్తను పెళ్లి చేసుకునే విషయం తెలిసిందే. వీరి పెళ్లి అక్టోబర్ 25న గ్రాండ్గా జరిగింది. అదితి ప్రభుదేవా యషాస్‌ ని వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి నవంబర్ 28న జరిగింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -