Guntur: గుంటూరు జిల్లాలో తెలుగుదేశం నుంచి పోటీ చేసే ప్రముఖులు వీళ్లే!

Guntur: ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి తరుణంలో ఇప్పటికే అన్ని పార్టీ నేతలు అభ్యర్థులను ఎంపిక చేసే ప్రక్రియ మొదలు పెట్టారని తెలుస్తుంది. అయితే తాజాగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితా తయారైందని తెలుస్తుంది అయితే ఈసారి ఎన్నికలలో భాగంగా చాలా వరకు గతంలో టిడిపి పార్టీ నుంచి పోటీ చేసిన వారిని రంగంలోకి దిగబోతున్నారని కొంతమందిని మాత్రమే కొత్త వారిని తీసుకోబోతున్నారని తెలుస్తోంది.

 

ఉమ్మడి గుంటూరు జిల్లాలలో మొత్తం 17 సీట్లు ఉండగా ఇప్పటికే 12 మందిని ఖరారు చేశారని తెలుస్తుంది. పొత్తులో భాగంగా తెనాలిని మాత్రం జనసేనకు సీటు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ 12 మందిలో 8 మంది గతంలో టిడిపి పార్టీ నుంచి పోటీ చేసినటువంటి వారికే టికెట్లు ఇచ్చారు మిగిలిన నలుగురు కొత్తవారు కావడం గమనార్హం.

మంగళగిరిలో నారా లోకేశ్‌, వేమూరులో నక్కా ఆనందబాబు, పొన్నూరు-ధూళిపాళ్ల నరేంద్ర కుమార్‌, తాడికొండ-తెనాలి శ్రావణ్‌ కుమార్‌, రేపల్లె-అనగాని సత్యప్రసాద్‌, చిలకలూరిపేట-ప్రత్తిపాటి పుల్లారావు, వినుకొండ-జీవీ ఆంజనేయులు, గురజాలలో యరపతినేని శ్రీనివాసరావు తిరిగి పోటీ చేయనున్నారు. ఇక తినాలి సీటు మాత్రం జనసేన పార్టీ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పోటీ చేస్తున్నారు. ఇక గుంటూరు పశ్చిమ సీటును కూడా జనసేన అభ్యర్థులకే కేటాయించాలని భావిస్తున్నారు కానీ ఇప్పటివరకు ఈ విషయం గురించి ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు.

 

ఇక కొత్తగా ఎంపిక చేసిన నలుగురు అభ్యర్థులు ఎవరు అనే విషయానికి వస్తే.. సత్తెనపల్లెలో మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, ప్రత్తిపాడులో రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి రామాంజనేయులు, మాచర్లలో జూలకంటి బ్రహ్మారెడ్డి, బాపట్లలో నరేంద్ర వర్మ పోటీ చేయనున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -