Celebrities: పిల్లలను సరిగ్గా పెంచుతూ ప్రశంసలు అందుకుంటున్న సెలబ్రిటీలు వీరే!

Celebrities: మామూలుగా తల్లిదండ్రులు సెలబ్రిటీలు అయ్యేసరికి ఆ పిల్లల ప్రవర్తనలో విపరీత ధోరణి కనిపిస్తుంది. వాళ్లకుండే డబ్బు, స్టేటస్,తల్లిదండ్రుల పరపతి చూసుకుని తమకు ఎదురే లేనట్టు ప్రవర్తిస్తూ ఉంటారు సెలబ్రిటీల పిల్లలు. అయితే తప్పు కేవలం పిల్లలదే అనుకుంటే పొరపాటు తల్లిదండ్రులకు కూడా ఇందులో భాగం ఉంటుంది. డబ్బు ఉంది కాబట్టి మా పిల్లలు కష్టపడకూడదు అనుకునే మెంటాలిటీ ఆ పిల్లల్ని చెడుతోవ పట్టించేలా చేస్తుంది.

 

అందుకు ఉదాహరణగా మనం చాలామంది సెలబ్రిటీల పిల్లల్ని రాత్రి పబ్బుల్లో గడుపుతూ పోలీసులకు దొరికిపోయి కొందర్ని, రోడ్లమీద విపరీతమైన చేష్టలు చేస్తూ ప్రజలను ఇబ్బందికి గురి చేసేవారు కొందర్ని మనం చూస్తూనే ఉంటాము. అయితే ఇందుకు విరుద్ధంగా కొందరు సెలబ్రిటీలు మాత్రం తమ పిల్లల్ని విచ్చలవిడితనానికి అలవాటు కానివ్వకుండా విలువలతో కూడిన పెంపకాన్ని ఇస్తున్నారు. ఆ సెలబ్రిటీస్ ఎవరో ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది అల్లు అర్జున్ దంపతుల గురించి.

తెలుగు వాళ్ళు కూడా తెలుగు భాషని చులకన చేస్తున్న ఈ రోజుల్లో తమ బిడ్డ అర్హ కి పట్టుబట్టి తెలుగు నేర్పిస్తున్నాడు. అంతేకాకుండా పెళ్లికి ముందు అల్లు అర్జున్ ఇంట్లో బూతులు మాట్లాడేవాడంట కానీ ఎక్కడ పిల్లలు వింటే అలవాటు చేసుకుంటారు అని ఇంట్లో బూతులు మాట్లాడటం మానేశాడు. అలాగే గోపీచంద్ కూడా తన పిల్లలకి సంస్కారవంతమైన బాల్యాన్ని ఇస్తున్నాడు. తన దగ్గర కోట్లు ఉన్నప్పటికీ పిల్లలను స్కూలుకి కారులో పంపించకుండా అందరితో సమానంగా స్కూల్ బస్సులో పంపిస్తాడంట.

 

ఇక సుమ కనకాల దంపతులు కూడా పిల్లలకి ఆర్థిక స్వాతంత్రం ఇవ్వడంలో ఆంక్షలు విధిస్తారంట. డబ్బు అవసరం అయితే తప్పితే అతిగా ఖర్చు పెట్టడానికి అసలు డబ్బులు ఇవ్వదంట సుమ. ఆదర్శవంతమైన తల్లిదండ్రులు అని మెచ్చుకుంటున్నారు నెటిజన్స్.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -