Veera Simha Reddy: థియేటర్స్ లో విజిల్స్ వేయించిన వీరసింహారెడ్డి డైలాగులు ఇవే!

Veera Simha Reddy: నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన మాస్ యాక్షన్ సినిమా ‘వీరసింహారెడ్డి’ థియేటర్లలో విడుదలై దూసుకుపోతోంది. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో ఈ సినిమాని మైత్రి మూవీస్ తెరకెక్కించారు. క్రాక్ ఫేమ్ గోపీచంద్ మలినేని ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో బాలయ్య సరసన శృతిహాసన్, హనీరోజ్ నటించారు. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత బాలయ్య నుండి ఈ మాస్ సినిమా వీరసింహారెడ్డి విడుదలైంది.

 

ఫ్యాన్స్ అంచనాలకు తగినట్లుగానే సాంగ్స్, ట్రైలర్ కూడా సినిమా హైప్ ను పెంచాయి. ‘గాడ్ ఆఫ్ మాసెస్’ అనే ట్యాగ్ లైన్ తో ఈ సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చింది. బాలయ్య యాక్షన్, డైలాగ్స్, డాన్స్, ఫైట్స్, ఎనర్జీ ఇందులో ఏమాత్రం తగ్గలేదు. వీరసింహారెడ్డి మూవీని కూడా ఎన్నో మాస్ అంశాలను జోడించి తెరకెక్కించారు. అటు ఫ్యాన్స్ తో పాటుగా ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్ కు కూడా ఈ సినిమా బాగా కనెక్ట్ అయ్యింది.

 

బాలయ్య మాస్ సినిమాతో వస్తున్నాడంటే డైలాగ్స్ కి కొదవ ఉండదని అర్థం చేసుకోవాలి. ఇందులో సాయిమాధవ్ బుర్రా పవర్ ఫుల్ డైలాగ్స్ రాశారు. మూతిమీద మొలిసిన ప్రతి బొచ్చు మీసం కాదురా బచ్చా! నాకు సవాల్ విసరకు.. నేను శవాలు విసురుతా! అని డైలాగ్ జనాలకు బాగా కనెక్ట్ అయ్యింది. నన్ను చూడాలంటే చావుకు కూడా పర్మిషన్ కావాలిరా.. అపాయింట్ మెంట్ లేకుండా వస్తే అకేషన్ చూడను, లొకేషన్ చూడను.. అడ్డంగా నరుకుతా!, నా మాట పదును.. నా కత్తి పదును.. నీ పక్కోడికి తెలుసు! నరకడం మొదలుపెడితే ఏ పార్ట్ ఏదో మీ పెళ్ళాలకు కూడా తెలీదు నా కొడకల్లారా! అంటూ బాలయ్య చెప్పే డైలాగ్ దడ పుట్టిస్తోంది.

 

సంతకాలు పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో, ఆ చరిత్ర సృష్టించిన వారి పేరు మారదు మార్చలేరు అనే డైలాగ్, నిన్ను తాకాలంటే కత్తి వణుకుద్దేమో.. నేను బరిలోకి దిగితే సీమే వణుకుద్ది, సిద్దప్ప.. ఎండ నడినెత్తికెక్కేలోపు కొడుకుల్ని నరికి.. ఈ మట్టికి ఎరవేసిపోదాం, రేయ్.. ఊరికి మంచి చేస్తే తలవంచుతా.. చెడు తలిస్తే ఎన్ని తలలైనా తెంచుతా! అనే డైలాగులు ఆడియన్స్ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -