Tollywood: టాలీవుడ్ హీరోలకు కలిసిరాని హెయిర్ స్టైల్స్ ఇవేనట.. ఫ్యాన్స్ కు కూడా అస్సలు నచ్చలేదుగా!

Tollywood: కొంతమంది సినిమా హీరోలకు ఆ పాత్రలకు వాళ్లు మాత్రమే సరిపోతారు అన్నట్లుగా వాళ్ళకి నప్పుతాయి. కానీ చాలామంది హీరోలకి ఆ సినిమా ఫ్లాప్ అవ్వటానికి కారణం వాళ్ళ గెటప్ లే. ఆ గెటప్ ల వల్ల స్టార్ హీరోలు సైతం ట్రోల్స్ కి గురైన సందర్భాలు కూడా ఉన్నాయి. చాలామంది హీరోలు కొత్త గెటప్ లో ట్రై చేద్దాం అనుకొని ఆఖరికి ట్రోల్స్ కి గురవుతారు. అలా అట్టర్ ఫ్లాప్ అయిన స్టార్ హీరోల క్యారెక్టర్లేంటో చూద్దాం.

ముందుగా నందమూరి నట సింహం బాలకృష్ణని తీసుకుందాము. ఆయన నటించిన రూలర్ సినిమాలో పోలీస్ పాత్ర ఆయనకి సూట్ అవ్వలేదు. ఆయన ఎంత బాగా నటించినప్పటికీ ఆ గెటప్ ఆయనకి నప్పకపోవటం వలన సినిమా డిజార్డర్ గా మిగిలింది. అలాగే అక్కినేని అందగాడు నాగార్జున భాయ్ సినిమాలో లో వేసిన క్యారెక్టర్ అతనికి అస్సలు నప్పలేదు.

 

దాంతో నెగటివ్ రెస్పాన్స్ కి వచ్చి సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి సినిమాలో ఆయన గెటప్ ని చూసి ఆయన ఫ్యాన్స్ సైతం షాక్ అయిపోయారు. పవన్ కళ్యాణ్ కి ఆ గెటప్ అంత అసహ్యంగా ఉంది. అలాగే వకీల్ సాబ్ సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ కొన్ని సీన్లలో చాలా డిఫరెంట్ గా, చాలా డల్ గా కూడా కనిపిస్తాడు. అయితే లక్కీగా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది.

 

అలాగే మెగాస్టార్ చిరంజీవి నటించిన అందరివాడు సినిమాలో గోవిందరాజులు పాత్ర కూడా ప్రేక్షకులను నిరాశ పరిచిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే విక్టరీ వెంకటేష్ షాడో సినిమాలో కూడా అతని పాత్రకి నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో వెంకటేష్ లుక్ ప్రేక్షకులకు అస్సలు నచ్చలేదు. అలాగే శక్తి సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ గెటప్ కూడా ప్రేక్షకులను పెద్దగా అలరించలేదు. మహేష్ బాబు సినిమా అతిధి లో కూడా అతని గెటప్ ప్రేక్షకులకు నచ్చలేదు.

Related Articles

ట్రేండింగ్

Assembly Election: ఏపీలో అక్కడ గెలిస్తే మంత్రి పదవి పక్కా.. ఈ నియోజకవర్గం ప్రత్యేకతలు ఇవే!

Assembly Elections: రాష్ట్రంలోని అతిపెద్ద నియోజకవర్గాలలో మైలవరం నియోజకవర్గం ఒకటి. ముందు ఈ నియోజకవర్గం కమ్యూనిస్టు పాలనలో ఉండేది, తర్వాత తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారింది. తెదేపా ఆవిర్భావం తర్వాత తొమ్మిది సార్లు...
- Advertisement -
- Advertisement -