Missing Women: ఏపీలో తప్పిపోయిన మహిళల లెక్కలు ఇవే.. ఎంతమంది మిస్సయ్యారంటే?

Missing Women: ఏపీలోని వాలంటీర్ వ్యవస్థ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారం రేపాయో మనకు తెలిసిందే. వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి ఆ ఇంట్లో మహిళల డేటాను తీసుకొని సంఘం విద్రోహులకు డేటాని అందజేస్తున్నారని తెలిపారు. ఈ క్రమంలోనే ఎంతోమంది మహిళలు బాలికలు అపహరణకు గురయ్యారని పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో అనుచిత వ్యాఖ్యలు చేశారు.

వాలంటీర్లు డేటా సేకరించడం వల్ల ఏపీలో దాదాపు 30 వేల మంది అపహరణకు గురయ్యారంటూ పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర ధ్రుమారం రేపాయి. ఈ క్రమంలోనే పవన్ చెప్పిన వ్యాఖ్యలు లెక్కలు కూడా నిజమేనని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రా రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం ఇవ్వడంతో వైసీపీ నేతలకు షాక్ తగిలింది.

 

నేషనల్‌ క్రైమ్ రికార్డ్స్‌ బ్యూరో లెక్కల ప్రకారం ఏపీలో 2019 నుంచి 2021వరకు మూడేళ్లలో 7వేల 928 మంది బాలికలు. .22వేల 278 మంది మహిళలు అదృశ్యమయ్యారని ఆయన వెల్లడించారు. మరి ఈ విషయంపై ఏపీ మహిళ కమిషన్ ఏం చేస్తుంది ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలరా అంటూ నిలదీశారు. అంటూ వస్తున్నటువంటి వార్తలపై ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి స్పందించారు

 

ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ 2019 నుంచి 23 ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం ఏపీలో 26 వేల మంది మహిళలు అదృశ్యమయ్యారని, వారిలో 23 వేల మందిని గుర్తించామని చెప్పారు. మిగిలిన వారిని గుర్తించే పనిలో ఉన్నామని తెలిపారు. అయితే వీరందరూ వివిధ కారణాల వల్ల అదృశ్యమయ్యారని రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు.కానీ అవగాహన లేనటువంటి కొందరు కాకి లెక్కలు చెబుతూ 30,000 అంటూ మాట్లాడటం సరైనది కాదని తెలిపారు. ఇక ఏపీలో ఎవరు మిస్ అయిన వారిని గంజాయితో ముడి పెట్టడం సరికాదని గంజాయి నివారణకే తాము ఎంతో కృషి చేస్తున్నామని డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -