Kangana: వాళ్లు సె* కూడా చేయరు.. కంగనా షాకింగ్ కామెంట్స్!

Kangana: తెలుగు ప్రేక్షకులకు బాలీవుడ్ నటి ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో కంగనా రనౌత్ కూడా ఒకరు. ఒకవైపు హీరోయిన్ గా వరుసగా సినిమాలలో నటిస్తూనే మరోవైపు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తరచూ ఏదోక వివాదంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. కాగా కంగనా రనౌత్ ఏదైనా కూడా ఎలాంటి విషయం అయినా కూడా కుండ బద్దలు కొట్టినట్లు ముఖం మీద చెప్పేస్తూ ఉంటుంది. అంతేకాకుండా కాంట్రవర్సీ క్వీన్‌గా కూడా గుర్తింపు తెచ్చుకుంది.

ఇది ఇలా ఉంటే తాజాగా కంగనా మరో వివాదంలో నిలిచింది. తాజాగా జనరేషన్‌ జెడ్‌ అనగా 1997 నుంచి 2012 మధ్య పుట్టినవారి పై తనదైన శైలీలో విమర్శలు గుప్పించింది. జనరేషన్‌ జెడ్‌ వాళ్లకి క్రమశిక్షణ, హార్డ్ వర్క్‌తో ఎదిగిన వారంటే ఇష్టం ఉండదు. షార్ట్ కట్స్‌లో సక్సెస్ పొందిన వారినే గౌరవిస్తారని విమర్శించింది. జనరేషన్‌ జెడ్‌ వాళ్ల చేతులు, కాళ్లు కర్రల మాదిరిగా ఉంటాయి. ఒకరితో ఇంటరాక్ట్ కావడం, చదవడం కంటే కూడా ఎక్కువ సమయం ఫోన్‌ల లోనే గడుపుతారు. వారి మనసులు స్థిరంగా ఉండలేవు.

 

ఆఫీస్‌లో బాస్‌ను గౌరవించరు కానీ ఆ పొజిషన్ తమకు కావాలి అనుకుంటారు అని తెలిపింది కంగనా. అలాగే స్టార్‌బక్స్, అవోకాడో టోస్ట్‌లను ఇష్టపడతారు కానీ సొంతగా ఇల్లు కొనుక్కునే స్థోమత ఉండదు. ఇతరులను అట్రాక్ట్ చేసేందుకు బ్రాండెడ్ దుస్తులు రెంట్‌కు తీసుకుంటారు కానీ కమిట్‌మెంట్ లేదా పెళ్లిని ద్వేషిస్తారు. చివరికి శృంగారం విషయంలో కూడా బద్ధకంగా వ్యవహరిస్తున్నారు.వీళ్లను ఈజీగా మానిప్యులేట్ చేయొచ్చు అని జనరేషన్‌ జెడ్‌ గురించి కంగనా తన ఇంస్టాగ్రామ్ స్టోరీ లో రాసుకొచ్చింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -