Kangana Ranaut: క్రిష్ శాపం వల్ల కంగనాకు దరిద్రం పట్టుకుందా.. ఏ సినిమా ముట్టుకున్నా ఫ్లాపే అంటూ?

Kangana Ranaut: మన పరిస్థితులు బాగున్నప్పుడు ఒకలాగా, పరిస్థితులు బాగోలేనప్పుడు ఒకలాగా ప్రవర్తన ఉంటే అది ఎప్పుడు మనకి మంచి చేయదు. ఈరోజు మన చేతిలో విజయం ఉంది కదా అని విర్రవీగితే రేపు మన దగ్గర ఏమీ లేనప్పుడు జాలిపడే వాళ్ళు ఎవరూ ఉండరు సరి కదా ఎద్దేవా చేస్తారు. ఇప్పుడు అలాంటి పరిస్థితిని అనుభవిస్తుంది కంగనా రౌనత్. ఒకప్పుడు కంగనాకి బాలీవుడ్లో ఒక రేంజ్ లో పాపులారిటీ ఉండేది. ఆమెపై కోట్లలో బిజినెస్ జరిగేది. క్వీన్ సినిమాతో తన చరిత్రని ఓ రేంజ్ లో నిలబెట్టింది కంగనా రౌనత్.

తర్వాత తను వెడ్స్ మను, తను వెడ్స్ మను రిటర్న్స్ వంటి చిత్రాలు ఆమెని మరో రేంజ్ కి తీసుకెళ్లాయి. అదే సమయంలో మన తెలుగు దర్శకుడు క్రిష్ తో ఆమె మణికర్ణిక అనే సినిమాని మొదలుపెట్టింది. సినిమా మొదలుపెట్టినప్పుడు అంత బానే ఉంది కానీ సినిమా పూర్తి అయ్యే సమయానికి వ్యవహారంలో ఎక్కడో తేడా కొట్టింది. తనకు సీన్ నచ్చలేదని ఒకసారి, క్యారెక్టర్ నచ్చలేదని ఒకసారి సాకులు చెప్పి మెల్లగా క్రిష్ ని పక్కన పెట్టేసింది.

స్వయంగా తనే రీ షూట్స్ చేసుకుంది. తర్వాత ఎడిటింగ్ కూడా తనకు నచ్చినట్లు చేసుకుంది. ముందు తనతో పాటు దర్శకుడుగా క్రిష్ పేరును కూడా పేర్కొంది కానీ తర్వాత ఆ పేరుని కూడా తీసేసి కేవలం దర్శకురాలుగా తన పేరుని మాత్రమే వేయించుకుంది. ఆ టైంలో క్రిష్ పడిన బాధ అంతా, ఇంతా కాదు. కంగనా తో పాటు ఆమె సోదరీ కూడా క్రిష్ మీద దారుణంగా అటాక్ చేశారు. అయితే ఆ పాపం ఊరికే పోలేదు.

మణికర్ణిక సినిమా కొంచెం పరవాలేదు అనిపించుకున్నా ఆ తర్వాత వచ్చిన ఏ సినిమా కూడా కంగనాకి కలిసి రాలేదు. జడ్జి మెంటల్ హై క్యా, ధడక్, తలైవి, చంద్రముఖి 2 ఇలా గత రెండు మూడు ఏళ్ల నుంచి చేసిన సినిమాలన్నీ డిజార్డర్లే. ఆమె లేటెస్ట్ మూవీ తేజస్ పై కూడా ఎవరు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. కర్మ అనేది మనల్ని వెతుక్కుంటూ వస్తుంది అంటారు కదా అది ఇదే అని అభిప్రాయపడుతున్నారు ప్రేక్షకులు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -