Relationship: భార్యకు భర్త చెప్పకూడని విషయాలు.. అవేంటంటే?

Relationship: భార్యాభర్తలు ప్రేమగా ఉండాలన్న దాంపత్య జీవితం సంతోషంగా సాఫీగా సాగిపోవాలన్నా ఇద్దరి మధ్య ఎటువంటి దాపరికాలు ఉండకూడదు. ఎటువంటి సమస్య వచ్చిన ఆలుమగలు మాట్లాడుకొని ఒకరి సమస్యను ఒకరు షేర్ చేసుకోవడం మంచిది. అలా చేయడం వల్ల వారి మధ్య బంధం మరింత బలపడుతుంది. దంపతుల మధ్య కమ్యూనికేషన్ కూడా చాలా ముఖ్యం. కొందరు భార్యలు కొన్ని రకాల విషయాలను భర్తల దగ్గర దాచి పెడితే మరికొందరు భర్తలు భార్యల దగ్గర కొన్ని రకాల విషయాలను దాచిపెడుతూ ఉంటారు. అలా కొన్ని కొన్ని ముఖ్యమైన విషయాలను దాచిపెట్టడ వల్ల వారి మధ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే భర్తలు భార్య మాట విన్నప్పుడే వారి కాపురం సజావుగా సాగుతుందట.

వారిని నొప్పించకుండా ఉన్నప్పుడే జీవితం ప్రశాంతంగా ఉంటుందని అంటున్నారు నిపుణులు.. ఈ క్రమంలోనే భార్యల దగ్గర కొన్ని రకాల విషయాలు కొన్ని రకాల పదాలను వాడకుండా ఉన్నప్పుడు వారి దాంపత్య జీవితం ఎంతో బాగా ఉంటుందట. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. చాలామంది భార్యాభర్తలు గొడవలు జరిగినప్పుడు తప్పంతా నీదే అంటూ భార్యల పై నింద మోపేస్తూ ఉంటారు. తప్పంతా నీదే..అన్న పదాన్ని భార్యల దగ్గర భర్తలు అస్సలు వాడకూడదు. అలా వాడడం వల్ల వారి మధ్య సమస్యలు మరింత పెరుగుతాయి. అలా చేయకుండా ఇద్దరు కాసేపు ఆలోచించి తప్పు ఎక్కడ జరిగింది అన్న విషయాన్ని చర్చించుకుంటే మంచిది. చాలామంది భార్యాభర్త లు గొడవ పడినప్పుడు కొందరు భర్తలు సారీ చెప్పినప్పటికీ భార్యలు కన్విన్స్ అవ్వరు.

 

అందుకు గల కారణం ఐ యాం వెరీ సారీ అని చెబుతూనే తర్వాత మళ్లీ కానీ అనే పదాన్ని ఉపయోగించడం వల్ల సారీ చెప్పిన ఆ ఫలితం ఉండదు. ఎక్కువమంది భార్యాభర్తలు ఉపయోగించే పదాలలో మళ్లీ మొదలు పెట్టావా అన్న పదం కూడా ఒకటి. చాలా సందర్భాలలో గొడవ పడినప్పుడు ఇదే పదాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఆ పదాలు మరింత ఎక్కువగా బాధిస్తాయి. కాబట్టి అటువంటి పదాలను ఉపయోగించకపోవడం మంచిది. చాలా మంది మగవాళ్ళు ఎక్కడ ఉన్నాం ఎవరితో ఉన్నామనేది కూడా చూడకుండా భార్యలపై గట్టిగా అరిచేస్తుంటారు. తర్వాత క్షమాపణలు చెప్పినా ప్రయోజనం ఉండదు. కాబట్టిఏదైనా నెమ్మదిగా చెప్పడం అలవాటు చేసుకోవడం మంచిది. నలుగురిలో ఆడవారిపై సీరియస్ అవ్వడం వల్ల వారు దానిని అవమానంగా భావిస్తాడు.

Related Articles

ట్రేండింగ్

Assembly Election: ఏపీలో అక్కడ గెలిస్తే మంత్రి పదవి పక్కా.. ఈ నియోజకవర్గం ప్రత్యేకతలు ఇవే!

Assembly Elections: రాష్ట్రంలోని అతిపెద్ద నియోజకవర్గాలలో మైలవరం నియోజకవర్గం ఒకటి. ముందు ఈ నియోజకవర్గం కమ్యూనిస్టు పాలనలో ఉండేది, తర్వాత తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారింది. తెదేపా ఆవిర్భావం తర్వాత తొమ్మిది సార్లు...
- Advertisement -
- Advertisement -