Chhattisgarh: ఆ ఊరంతా యూట్యూబర్సే!

Chhattisgarh: ఒక్కో ఊరికి ఒక్కో స్పెషాలిటీ ఉంటుంది. ఒక ఊరిలో ఇళ్లు కట్టెవారు ఎక్కువగా ఉంటారు.. మరో ఊరిలో కుస్తీలు పడేవారు.. కుంటలు తయారుచేసివారు.. గుర్రాలు పెంచేవారు ఇలా ఒక్కో ఊరిలో ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అయితే మనం ఇప్పుడే చెప్పుకోబోయే ఊరి మరింత ప్రత్యేకం. ప్రస్తుత కాలంలో టెక్నాలజీ నగరాలు, పట్టణాలే కాకుండా పల్లెపల్లెకు సోకింది. దీంతో చిన్న చిన్న గ్రామాలు కూడా టెక్నాలజీలో ఓ అడుగు ముందుగానే ఉన్నాయి. దీంతో ఇంకాస్త లోతుగా ఆలోచించి యూట్యూబ్‌ ఛానళ్లు పెట్టి తమ ప్రతిభను వెలికి తీయడంతో పాటు, ఆదాయాన్ని సైతం పొందుతున్నారు.

యూట్యూబ్‌ పెట్టినంత మాత్రన అందరికీ ఆ ఛానల్‌ గురించి తెలియదు. ఫాలోవర్స్‌ పెరిగితేనే మనం పెట్టిన ఛానల్‌ దేశవ్యాప్తంగా వ్యాపిస్తోంది.ఈ ఆచోలన అందరికీ ఉన్నా.. దాన్ని ఆచరణలో కొందరే పెడుతారు.. దాన్ని చివరి వరకూ మరికొందరే తీసుకెళ్తారు. ఛతీస్‌ఘడ్‌లోని తుస్లీ అనే గ్రామంలో ప్రస్తుతం యువతీ, యువకులు అదే పనిలో నిమగ్నమయ్యారు. మారుతున్న కాలానికి అనుగుణంగా వారు కూడా మారుతున్నారు. తమ గ్రామాన్ని వదిలి పట్టణాలు, నగరాల్లోకెళ్లి డబ్బులు సంపాదించడం కన్నా.. మనమే ఓ యూట్యూబ్‌ ఛానల్‌పెట్టి డబ్బులు సంపాదిస్తూ గుర్తింపు తెచ్చుకోవాలని డిసైడ్‌ అయ్యారు. దీనిలో కొంతమంది సక్సెస్‌ కావడంతో ఆ గ్రామంలో అధిక సంఖ్యలో అదే బాట పట్టారు. ఆ గ్రామామే ఇప్పుడు యూట్యూబర్స్‌ హబ్‌గా మారింది.

ఉదయం లేవగానే ఆ గ్రామంలో ఏ మూలన చూసిన కెమెరాలు, లైట్లు, యాక్షన్‌ అనే పదాలతో సందడిగా ఉంటుంది. తుస్లీ గ్రామంలో ఇద్దరు స్నేహితులైన జ్ఞానేంద్ర శుక్లా, జయవర్మ. వీరిద్దరు ప్రారంభంలో చేసిన కొన్ని వీడియోలు విపరీతంగా వైరల్‌ కావడంతో నెటిజన్ల నుంచి ప్రశంసలు వచ్చాయి. రోజురోజుకు వారికొస్తున్న ఆదరణ చేసిన ఆ గ్రామంలోని మరి కొందరు యూట్యూబ్‌ ఛానళ్లు పెట్టి తక్కువ సమయంలోనే ఫేమస్‌ అయ్యారు. జ్ఞానేంద్ర శుక్ల చానల్‌ పెట్టకముందు ఎస్‌బీఐ ఉద్యోగం చేసేవాడు. శుక్లకు ముందునుంచి సినిమాలంటే పిచ్చి ఎక్కువగా యూట్యూబ్‌లో సినిమాలు కంటెంట్‌లు చూసేవాడు. కొన్ని రోజుల తర్వాత ఉద్యోగం మానేసి ఓ యూట్యూబ్‌ చానల్‌ను ప్రారంభించాడు. ఇప్పటి వరకు దాదాపుగా 250కి పైగానే వీడియోలు చేశాడు.1.15 లక్షల సబ్‌స్కైబర్స్‌ ఉన్నారు.

ఉపాధ్యాయ వృత్తిలో ఉండే జయవర్మ యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించేందుకు తన వృత్తిని వదిలేశాడు. తమను చూసిన మా గ్రామాస్తులు, టిక్‌టాక్,రీల్స్‌ ఇప్పుడు వీడియోలు చేయడం ప్రారంభించారని జయవర్మ తెలిపాడు. ఇంతకు ముందు అతడు నెలకు రూ. 12 వేలు సంపాదించేవాడు. యూట్యూబ్‌ ద్వారా నెలకు రూ. 30–35 వేలు సంపాదిస్తున్నాడట.తుస్లీ గ్రామంలో 3000 వేల జనాబా ఉంది. అందులో దాదాపుగా 40 శాతం మంది యూట్యూబ్‌లో నిమగ్నమయ్యారు. ఇందులో బాలికలు సైతం యూట్యూబ్‌ చానళ్లు నడుపుతున్నారు. పింకీ సాహో అనే యువతి మంచి కంటెంట్‌ రూపొందిస్తూ దూసుకెళ్తోంది. ఆ యువతి యూట్యూబ్‌ చానల్‌ ప్రారంభించిన ఏడాదికే దాదాపుగా 40 ఛానళ్ల నిర్వహణ చూసుకుంటోంది. ఆ గ్రామంలో ఎక్కువగా యూట్యూబ్‌ ద్వారానే ఆదాయాన్ని రాబడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: జగన్ ను ముంచిన సలహాదారుడు అతనేనా.. వృద్ధాప్య పెన్షన్ విషయంలో ముంచింది ఎవరంటే?

CM Jagan: 2014 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యేసరికి రాష్ట్రంలో వృద్ధాప్య పెన్షన్ కేవలం 200 రూపాయలు మాత్రమే ఉండేది. చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే రూ. వెయ్యి చేశారు. మళ్లీ...
- Advertisement -
- Advertisement -