Chhattisgarh: భార్యను నల్లగా ఉన్నావనడంతో అది కోసేసింది!

Chhattisgarh: ప్రస్తుత కాలంలో భార్య భర్తల గొడవలు, విడాకులు, హత్యలు తరచూ జరుగుతున్నాయి. భార్యను భర్త హత్య చేయడమో, భార్య తన భర్తను ఇతరులతో కలిసి మర్డర్‌ ప్లాన్‌ చేయడం తరచూ జరుగుతున్నాయి. కొందరు అదనపు కట్నం తీసుకురావాలని మహిళలను వేధిస్తుంటారు. మరి కొందరు మహిళలు తన భర్తను ఇబ్బందులకు గురి చేస్తుంటారు. ఇలా వివిధ రకాలుగా ఒకరిపై ఒకరు వేధింపులకు దిగుతూ ప్రాణాలను కోల్పోతున్నారు. ఇలాంటి ఘటన ఒకటి చత్తీస్‌ఘాడ్‌లో చోటు చేసుకుంది. తన భర్త తరచూ నల్లగా ఉన్నావంటూ వేధింపులకు దిగడంతో పాటు గొడవ చేస్తున్నాడని ఆ మహిళ అతడి పురుషాంగాన్ని కోసేసింది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఛత్తీస్‌గఢ్‌ లోని దుర్గ్‌ జిల్లాలో అమలేశ్వర్‌ గ్రామంలో అనంత్‌ సోన్వానీ తన భార్య సంగీత తో కలిసి నివాసముంటున్నాడు. మొదట్లో ఇద్దరూ కలిసి మెలిసి సుఖసంతోషాలతో ఉండేవారు. కొన్ని రోజుల తర్వాత సోన్వానీ సంగీతతో గొడవకు దిగడం పనిగా పెట్టుకున్నాడు. ఎలాంటి కారణం లేకపోయినా ఆమెను వేధించడం, కట్టడం చేస్తుండేవారు. ఈ క్రమంలో సోన్వానీ సంగీత మరో కొత్తరకంగా వేధించడం ప్రారంభించాడు. నువ్వు చాలా నల్లగా ఉన్నాయని నిన్ను చూస్తే మూడ్‌ రావడం లేదని వేధించేవాడు. అంతేకాక సంగీత శరీరంలో వివిధ రకాల మచ్చలు ఉన్నాయంటూ మానసికంగా వేధించేవాడు. ఈ విషయాలపై ఇరువురి మధ్య తరచూ గొడవలు జరిగేవి.

రోజురోజుకు సంగీతపై వేధింపులు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో మరోసారి గొడవ పెద్దదైంది. ఉదయం గొడవపడి రాత్రి భోజనం చేసి పడుకున్నారు. సోల్వానీ గాఢ నిద్రలో ఉన్నప్పుడు సంగీత లేచి గొడ్డలితో ఇష్టం వచ్చినట్లు నరికింది. ఆ తర్వాత భర్త పురుషాంగాన్ని కూడా కోసేసింది. ఆ తర్వాత మళ్లీ నిద్రకు ఉపక్రమించింది. ఉదయం లేవగానే తన భర్తను ఎవరో చంపేశారని లబోదిబోమంటూ మొత్తుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సంగీత కదలికలపై నిఘా పెట్టారు. ఆ తర్వాతి రోజు స్టేషన్‌కు తీసుకెళ్లి తమదైన శైలిలో విచారించగా చేసిన నేరాన్ని ఒప్పుకుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -