Maharashtra: ఈ రైతు మామూలోడు కాదుగా.. కోటి లీటర్ల నీటితో అలా చేసి?

Maharashtra: సాధారణంగా రైతులు వ్యవసాయం చేసి మంచి పంటలు పండించి ఆహార ధాన్యాలను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలి అంటే తప్పనిసరిగా నీటి ప్రాముఖ్యత ఎంతో ఉంది.ఒకప్పుడు అధికంగా వర్షాలు పడటం వల్ల వర్షాధారంగానే ఎన్నో రకాల పంటలను పండించేవారు అలాగే భూగర్భ జలాలు కూడా అధికంగా ఉండటం వల్ల నేటికీ కొరత ఉండేది కాదు అయితే ప్రస్తుతం భూగర్భ జలాలు భారీగా ఇంకిపోవడంతో రైతన్నలకు కూడా కష్టాలు మొదలయ్యాయి.నీరు వసతి లేకపోవడంతో ఎంతో మంది వ్యవసాయం మానేసి ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్తూ కూలి పనులు చేస్తున్నారు.

ఇలా వ్యవసాయం చేయడానికి నీటి సదుపాయం లేనటువంటి ఒక రైతు ఒక వినూత్న రీతిలో ఆలోచించి సరికొత్త రికార్డు సృష్టించారు. ఇలా ఆ రైతు చేసిన ఆలోచన కారణంగా కొన్ని పదుల సంఖ్యలో ఎకరాలకు వసతి కల్పిస్తున్నారు ఇంతకీ ఆ రైతు ఏం చేశారు? ఏంటి అనే విషయానికి వస్తే?.. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాకు చెందిన మారుతి బాజుగడే సరికొత్త నిర్ణయం తీసుకున్నారు.

తన పొలంలో ఒక ఎకరం విస్తీర్ణంలో 41 అడుగు లోతులో పెద్ద బావిని తవ్వించారు అయితే ఈ నీరు ఇంకిపోకుండా బావి చుట్టూ ప్లాస్టరింగ్ చేయించారు. ఇలా ఈ భావి ద్వారా ఈయన ఏకంగా 10 కోట్ల లీటర్ల నీటిని నిల్వ చేసి పెట్టారు. ఈ విధంగా ఈ రైతు ఏకంగా కోట్ల లీటర్ల నీటిని ఒడిసి పట్టుకొని ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ఇలా ఈయన పోగు చేసిన ఈ నీటితో ఇప్పుడు ఏకంగా 50 ఎకరాల పొలంలో పంట సాగుకు నీటిని అందిస్తున్నాడు.ఇలా వ్యవసాయాన్ని బ్రతికించుకోవడం కోసం ఈ రైతు చేసిన పని తెలిసి అందరూ చాలా గ్రేట్ అంటూ ఈయనపై పెద్ద ఎత్తున ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -