Farmer: ఫైవ్ స్టార్ హోటల్ కు వెళ్లిన రైతు.. బట్టలు బాలేవని అవమానించారు.. చివరకు ట్విస్ట్ ఏంటంటే?

Farmer: ధనమేరా అన్నిటికీ మూలం అని ఏ కవి అన్నాడో కానీ ఆ మాట అక్షరాల నిజం. డబ్బుకు ఇచ్చే విలువ మనుషులకి ఇవ్వడం లేదు సమాజం. డబ్బు ఉన్నవాడికి ఒకలాంటి గౌరవం, లేని వాడికి ఒకలాంటి గౌరవం ఇస్తారు నేటి తరం మనుషులు. అలాగే మనకి అన్నం పెట్టే రైతులకు ఇచ్చే విలువ, పేదవాళ్ళకి ఇచ్చే విలువ ఒకలాగా ఉంటే సినిమా హీరోలకి ఇచ్చే విలువ ఒకలాగా ఉంటుంది. నిజానికి అన్నం పెట్టి మన కడుపు నింపుతున్న రైతుకు ఇవ్వాల్సిన విలువ ఇవ్వకుండా సినిమా హీరోలను, క్రికెటర్ల ను నెత్తిన పెట్టుకుంటారు జనాలు.

అలాంటి కథ ఒకటి ఇప్పుడు చెప్పుకుందాం. ఒక ఊరిలో ఒక రైతు కష్టపడి పనిచేసే తన పొలాన్ని సాగు చేసుకునేవాడు. తన కష్టంతోనే కూతురిని పెంచి పెద్ద చేసి పెళ్లి కూడా చేసి అత్తారింటికి పంపించాడు. తర్వాత కూడా తన వ్యవసాయం తాను చేసుకుంటూ అప్పుడప్పుడు కూతురింటికి చూడటానికి వెళ్లి వస్తూ ఉండేవాడు. అలాగే ఒకసారి కూతురింటికి బయలుదేరి అట్నుంచి వచ్చేటప్పుడు ట్రైన్ కోసం నిరీక్షిస్తూ ఉంటాడు.

ట్రైన్ ఇంకా రావడం ఆలస్యం అవుతుందని తెలుసుకొని పక్కనే ఉన్న ఫైవ్ స్టార్ హోటల్లో భోజనం చేయడానికి వెళ్తాడు. అక్కడ ఉన్న స్టాఫ్ అతని వేష భాషలు చూసి ముఖం చిట్లించుకుని అదే విషయాన్ని వెళ్లి మేనేజర్ కి చెప్తారు. మేనేజర్ రైతు దగ్గరికి వచ్చి మురికిగా ఉన్న అతని బట్టల్ని చూసి అసహ్యించుకుంటాడు. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఇక్కడ బిల్లు కట్టడానికి సరిపడా డబ్బులు నీ దగ్గర ఉన్నాయా..

నీకు కావాలంటే చుట్టుపక్కల చిన్నచిన్న హోటల్స్ చాలా ఉన్నాయి. అక్కడికి వెళ్లి తిను అని అవమానకరంగా మాట్లాడుతాడు. నా దగ్గర డబ్బులు ఉన్నాయి అని రైతు చూపించేసరికి మేనేజర్ మొహం ఆనందంతో వెలిగిపోతుంది. అతనికి లాంచనంగా భోజనం వడ్డించమని స్టాప్ కి చెప్తాడు మేనేజర్. ఖరీదైన భోజనం చేసిన ఆ రైతు 2000 రూపాయలు టిప్పు కూడా ఇచ్చి బయటికి వచ్చేసేముందు మేనేజర్ తో డబ్బుని చూసి మనిషికి విలువ ఇవ్వకండి అని హితబోధ చేసి వచ్చేస్తాడు. సిగ్గుతో తలవంచుకుంటాడు మేనేజర్.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -