Farmer is King: రైతే రాజు.. టమాటా పంట ఇంతమంది రైతులను కోటీశ్వరులను చేసిందని తెలుసా?

Farmer is King: దేశానికి వెన్నెముక రైతు అని చెబుతారు కానీ అందరి దృష్టిలో రైతు అంటే ఒక పేదోడు మాత్రమే. ప్రతిరోజు మనం కడుపునిండా అన్నం తింటున్నాము అంటే దాని వెనుక రైతు కృషి ఉంది కానీ ఆ విషయాన్ని గుర్తించకుండా రైతు అంటేనే ఒక చిన్న చూపు చూస్తున్న రోజులు ఇవి. అయితే రైతులు మాత్రం పంట పెడితే పంట ద్వారా లాభం పొందుతామ లేదా అన్న విషయాలను దృష్టిలో పెట్టుకోకుండా నిరంతరం కష్టపడుతూనే ఉంటారు. అయితే కొన్నిసార్లు చేతికి వచ్చిన పంట చేజారి పోతుంటే ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతన్నలు ఎంతో మంది ఉన్నారు.

పంటలకు కనీస మద్దతు ధర లేక అప్పుల పాలైనటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. మనం ప్రతిరోజు ఉపయోగించే టమోటా పంట ద్వారా ఎంతో మంది రైతులు నష్టపోయిన సందర్భాలు ఉన్నాయి.టమోటా పంటకు కనీస మద్దతు ధర లేకపోవడంతో రోడ్డు పక్కల కుప్పలు తిప్పలుగా పండిన పంటను పడేసి కన్నీళ్ళతో రైతులు వెను తిరుగుతున్నారు. ఇలా ఒకప్పుడు కన్నీళ్లు పెట్టించిన టమోటానే ఇప్పుడు రైతులను రాజులుగా చేసింది. అప్పుల బాధలలో ఉన్నటువంటి రైతులను కోటీశ్వరులను చేసింది.

 

టమోటాకు ఎప్పుడు లేనటువంటి ధరలు ఈసారి రావడంతో రైతులు కోటీశ్వరులుగా మారిపోయారు. రైతే రాజు అన్న నానుడి నిజమేనని టమోటా నిరూపించింది.ఎప్పుడూ లేనివిధంగా టమోటా ధరలు ఆకాశాన్ని ఆ తాకాయి దీంతో టమోటా పెట్టినటువంటి ఎంతో మంది రైతులకు కోటీశ్వరులుగా మారిపోయారు. ఇలా ఎప్పుడూ చూడనీ విధంగా డబ్బు తమకు రావడంతో రైతుల కళ్ళల్లో కన్నీటికి బదులు ఆనందభాష్పాలు వస్తున్నాయి.

 

రైతులుగా ఇన్ని రోజులు నష్టపోయిన వారిని టమోటో పంట వారిని రాజును చేయడంతో ఎంతో లగ్జరీగా వారికి కావలసిన వస్తువులు అన్నింటిని కొనుక్కొని ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇలా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక ప్రాంతాలలో ఎంతో మంది రైతులు కోటీశ్వరులుగా మారిపోయిన సంఘటనలు మనం చూస్తున్నాము.. ఇలా రైతులకు భారీ స్థాయిలో లాభాలు కాకపోయినా మద్దతు ధర లభిస్తే రైతుకు ఎవరు సాటి లేరని చెప్పాలి. ఇలా టమోటా ద్వారా ఎంతో మంది రైతులు తమ జీవితంలో కోల్పోయినటువంటి సంతోషాన్ని తిరిగి పొందారని చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -