Onion: అలా అయితే ఉల్లి తినడం ఆపేయండి.. మంత్రి సంచలన వ్యాఖ్యలు వైరల్!

Onion: నిత్యావసర వస్తువులు కూరగాయల ధరలు సామాన్యులని భయపడుతూనే ఉన్నాయి. ఆమధ్య అంతా టమాటా ధరలు కొండెక్కి కూర్చుంటే ఇప్పుడు ఉల్లి వంతు వచ్చింది. ఉల్లి ధరలు రోజురోజుకీ పెరిగిపోతూనే ఉన్నాయి. కొనేందుకు సామాన్యులు జంకుతున్నారు. పెరుగుతున్న ఉల్లి ధరలను కట్టడి చేసి దేశీయంగా సరఫరా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ఉల్లిపాయలపై 40 శాతం ఎగుమతి సుంకం విధిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా రైతుల వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.

2023 డిసెంబర్ 31 వరకు ఉల్లిపాయలపై ఎగుమతి సుంకాన్ని విధిస్తున్నట్లు ఈ నెల 19 విడుదల చేసిన ప్రకటనలో ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. అయితే దీనిపై మంత్రి దాదా భూసే స్పందించారు. మీరు 10 లక్షల రూపాయల విలువైన వాహనాన్ని వినియోగిస్తున్నప్పుడు.. రిటైల్ ధర కంటే 10 లేదా 20 రూపాయలు ఎక్కువైనా ఉల్లిపాయలను కొనుగోలు చేయవచ్చు.

 

ఉల్లి ని కొనుగోలు చేసే స్తోమత లేని వారు రెండు నుంచి నాలుగు నెలల పాటు తినకపోయినా పెద్దగా ఏమీ తేడా ఉండదు అని అన్నారు. కొన్నిసార్లు క్వింటాల్ కి 2000 ధర పలకవచ్చు, కొన్నిసార్లు 200 పలకవచ్చు. ఎగుమతి సుఖాన్ని పెంచి ధరలని అదుపులో ఉంచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీని గురించి చర్చలు నిర్వహించి సామరస్యంగా పరిష్కారం చేసుకోవాలి అంటూ చెప్పుకొచ్చారు దాదాభూసే.

 

దేశంలోని అతిపెద్ద టోకు ఉల్లిపాయల మార్కెట్ అయిన లాసల్గావ్ సహా నాసిక్ లోని అన్ని వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీలలో సోమవారం ఉల్లి వేలాన్ని నిరవధికంగా నిలిపివేసాయి. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు నిరవధికంగా ఉల్లి వేలంలో పాల్గొనవద్దని నాసిక్ జిల్లా ఉల్లి వ్యాపారుల సంఘం పిలుపునిచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎగుమతి సుంకం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందేనని రైతులు వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -