CM KCR: మహారాష్ట్రలో కేసీఆర్ దే హవా.. దుమ్ము దులుపుతున్నాడుగా!

CM KCR: తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు నాగపూర్ లోని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన సంగతి మనందరికీ తెలిసిందే. పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ఏ దేశమైనా అభివృద్ధి చెందేందుకు 2-3 దశాబ్ధాలు సమయం పడుతుంది. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలైనా ఇంకా దేశం ఎందుకు అభివృద్ధి చెందలేదు? కృష్ణాగోదావరి నదులు మహారాష్ట్రలో నుంచే పారి దిగువనున్న తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవహిస్తాయి.

వాటిపై మేము ప్రాజెక్టులు కట్టుకొని సాగునీరు, త్రాగునీరు సరఫరా చేసుకొని పంటలు పండించుకొంటుంటే, మహారాష్ట్రలో సాగుత్రాగు నీరు ఎందుకు కటకటలాడాల్సివస్తోంది. మహారాష్ట్రలో పలు ప్రాంతాలలో వారానికి లేదా 10 రోజులకు త్రాగునీరు అవుతుందని విని నేను ఆశ్చర్యపోయాను. రాష్ట్రంలోనే నదులు పారుతుంటే ఎందుకీ మీకీ దుస్థితి?దేశాన్ని, రాష్ట్రాన్ని పాలిస్తున్న బిజెపి ఎందుకు రైతులకు సాగునీరు, ప్రజలకు త్రాగునీరు అందించడం లేదు? దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఇదే పరిస్థితి. ఢిల్లీ పక్క నుంచే గంగా, యమునా నదులు పారుతున్నా ప్రజలకు త్రాగునీరు ఉండదు.

 

దేశాన్ని పాలిస్తున్న కాంగ్రెస్‌, బిజెపిలు 75 ఏళ్లపాటు ఏం చేశాయి? ఎన్నికలలో గెలవడం తప్ప మరే లక్ష్యం లేకపోవడం వలననే నేటికీ దేశంలో ఇటువంటి దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ రాష్ట్రంలాగా మహారాష్ట్రని కూడా అభివృద్ధి చేసుకోవచ్చు. సాగునీరు అందిస్తే మన రైతులకు ఏడాదికి మూడు పంటలు పండించి ఇతర రాష్ట్రాలకు, దేశాలకు కూడా ఎగుమతి చేయగల సమర్ధులే.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -