Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ప్లాన్ బి ఇదే.. ఆ విధంగా చేయబోతున్నారా?

Pawan Kalyan: సాధారణంగా ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి సార్వత్రిక ఎన్నికలు జరుగుతుంటాయి. 2019 సంవత్సరంలో ఎన్నికలతర్వాత జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం మనకు తెలిసిందే. అయితే 2024వ సంవత్సరంలో తిరిగి మరోసారి ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో అన్ని పార్టీలు ఎన్నికలకు సిద్ధమవుతూ ఉన్నాయి. అయితే ఈసారి మాత్రం ఏపీలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తుంది.

 

ఇప్పటికే ముందస్తు ఎన్నికల గురించి ఏదో ఒక వార్త వైరల్ అవుతుంది ఇక జగన్ సైతం ఢిల్లీ వెళ్లి ఈ విషయం గురించి ప్రధానమంత్రితో చర్చించారని ఏ క్షణమైనా ముందస్తు ఎన్నికల గురించి ప్రకటించే అవకాశాలు ఉన్నాయని పలువురు భావిస్తున్నారు. అయితే ముందస్తు ఎన్నికలు వచ్చిన ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలుగుదేశం ప్రభుత్వం కూడా ధీమా వ్యక్తం చేస్తుంది. ఈ క్రమంలోనే నారా లోకేష్ పాదయాత్రలో బిజీ అవుతూ తన పార్టీని ప్రజలకు చేరువగా తీసుకెళ్తున్నారు.

ఇక జనసేన పార్టీ విషయానికి వస్తే ముందస్తు ఎన్నికలు రామన్న నేపథ్యంలో ఈ ఏడాది చివరి వరకు పవన్ కళ్యాణ్ వరుస సినిమా షెడ్యూల్ తో ఎంతో బిజీగా ఉండిపోయారు.ఒకవేళ ముందస్తు ఎన్నికల కనక జరిగితే పవన్ కళ్యాణ్ పార్టీ ప్రచారానికి ఏమాత్రం సమయం సరిపోదని ఇలాంటి తరుణంలో పార్టీ గెలవడం కష్టతరమవుతుందని పలువురు భావిస్తున్నారు.జనసేన పార్టీని ప్రజలలోకి తీసుకెళ్లాలంటే గ్రామస్థాయిలో జనసేన పార్టీ నాయకులు ఉండటం ఎంతో అవసరం అయితే పవన్ కళ్యాణ్ కు ఆ బలగం లేదని తెలుస్తోంది.

 

పవన్ కళ్యాణ్ ఏదైనా బహిరంగంగా సభలు ఏర్పాటు చేస్తే పెద్ద ఎత్తున అభిమానులు కార్యకర్తలు అక్కడికి చేరుకుంటారు. కానీ ద్వితీయ శ్రేణి నాయకత్వం పవన్ కళ్యాణ్ కు బలహీనంగా ఉందని తెలుస్తుంది. ఒకవేళ ముందస్తు ఎన్నికలు కనక జరిగితే ఇలాంటి వాటన్నింటినీ సార్ట్ అవుట్ చేసుకోవడానికి సమయం సరిపోదు.ఇలాంటి సమయంలో ప్రజలలోకి తన పార్టీని ఎలా తీసుకెళ్తారు అనే సందేహాలు కూడా తలెత్తుతున్నాయి. ఒకవేళ ముందస్తు ఎన్నికలు వచ్చినా పవన్ కళ్యాణ్ దగ్గర ప్లాన్ బి ఏమైనా ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ బి అంటే టిడిపితో పొత్తు పెట్టుకోవడమేనా.. ముందస్తు ఎన్నికలు కనక వస్తే పవన్ కళ్యాణ్ ఇలా టిడిపి పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలో దిగుతారా అంటూ సందేహాలు తలెత్తుతున్నాయి. మరి ఈ ఎన్నికలను పవన్ కళ్యాణ్ ఎలా ఎదుర్కోబోతున్నారో తెలియాల్సి ఉంది.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -