Krishna: సూపర్ స్టార్ కృష్ణ మంచి మనసుకు నిదర్శనం ఇదే!

Krishna: సూపర్ స్టార్ కృష్ణ స్టార్ హీరోగానే కాక, గొప్ప మనసున్న వ్యక్తిగా ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతారు. తోటీ కళకారులకు సాయం చేయడంలో, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఆదుకోవడంలోనూ ఆయన ముందుండేవారు. అలాగే ఆయనకు నిర్మాతల హీరోగా పేరుంది. ఓసారి తాను నటించిన మూడు సినిమాలకు రెమ్యునరేషన్ ఇవ్వకుండానే సినిమాలు రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సిద్దమయ్యారు. దీంతో కృష్ణ వారిని పిలిచి మాట్లాడారు. వారికేదో కష్టాలున్నాయని తెలుసుకుని తనే తిరిగి డబ్బులిచ్చి సినిమాలు విడుదల చేసుకోవాలని చెప్పారట. తాజాగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ విషయాలను వెల్లడించాడు. ఇలా చెప్పుకుంటే పోతే ఆయన గొప్పతనాలు ఎన్నో ఉన్నాయి.

కృష్ణ నుంచి సహాయాన్ని పొందినవారిలో ఒకప్పటి రొమాంటిక్ హీరో హరనాథ్ కూడా ఉన్నారు. కృష్ణకంటే ముందుగానే హరనాథ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. అందగాడుగా మంచి మార్కులు కొట్టేసిన హరనాథ్, రొమాంటిక్ హీరోగా విపరీతమైన క్రేజ్‌ను సొంతం చేసుకున్నాడు. అయితే ఒకానోక సమయంలో హరనాథ్ మద్యానికి బానిస అయ్యాడట. ఆయన ఆరోగ్యం దెబ్బతినడంతో అవకాశాలు తగ్గాయి. దీంతో హరనాథ్‌ను ఆర్థిక ఇబ్బందులు వెంటాడాయి.

భారీ మొత్తంలో డబ్బు ఇచ్చి ఆదుకున్న కృష్ణ..
దిక్కతోచని స్థితిలో హరనాథ్‌ కృష్ణను కలుసుకోవడానికి పద్మాలయ స్టుడియోస్‌కి వెళ్లారట. ఆయన వచ్చిన విషయాన్ని సిబ్బంది కృష్ణ దగ్గరికి వెళ్లి చెప్పగానే ఆయనే స్వయంగా కిందికి వెళ్లి హారనాథ్‌ను లోపలికి తీసుకువెళ్లి మాట్లాడారట. ఆయన పరిస్థితి అర్థం చేసుకున్న కృష్ణ ఇంటికి తీసుకుని వెళ్లి అతిథి మర్యాదలు చేశారు. కొన్ని రోజులు ఆయనను ఇంట్లోనే ఉంచుకోవడమే కాకుండా ధైర్యం చెప్పి.. పెద్ద మొత్తంలో డబ్బును హరనాథ్‌కు ఇచ్చి పంపారట. అయితే ఈ విషయాన్ని కృష్ణ ఎప్పుడూ ఎక్కడా చెప్పకపోవడం ఆయన గొప్ప మనసుకు నిదర్శనం.

కాగా, ఈఏడాది సెప్టెంబర్ 2న హరనాథ్‌ గురించి తెలియజేసే ‘అందాల నటుడు’ అనే పుస్తకాన్ని కృష్ణ తన నివాసంలో విడుదల చేశారు. తాను హీరోగా తెరకెక్కిన ‘మా ఇంటి దేవత’ చిత్రాన్ని హరనాథ్‌ నిర్మించారని గుర్తు చేసుకున్నారు. అసలైన అందాల నటుడు, మంచి మనసున్న వ్యక్తి హరనాథ్‌ అని కొనియాడారు. హరనాథ్ కుమార్తె జి. పద్మజ, అల్లుడు జి.వి.జి. రాజు (‘తొలి ప్రేమ’, ‘గోదావరి’ చిత్రాల నిర్మాత), మనవలు శ్రీనాథ్ రాజు, శ్రీరామ్ రాజు పాల్గొన్నారు. నాటి తరం అమ్మాయిల కలల రాకుమారుడిగా పేరొందిన బుద్ధరాజు హరనాథ్‌ 1936లో సెప్టెంబరు 2న జన్మించారు. తూర్పుగోదావరి జిల్లా రాపర్తి (పిఠాపురం) గ్రామానికి చెందిన ఆయన చెన్నైలో పాఠశాల విద్య, కాకినాడలో డిగ్రీని పూర్తి చేశారు. తర్వాత చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, బెంగాలీ భాషల్లో కలిపి 167 సినిమాల్లో నటించారు. నందమూరి తారకరామారావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘సీతారామ కల్యాణం’లో శ్రీరాముడి పాత్రలో కనిపించి, తెలుగు ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచారు. 1989 నవంబర్ 1న మరణించారు.

Related Articles

ట్రేండింగ్

YS Sharmila: షర్మిల ఎఫెక్ట్ తో క్రిస్టియన్ ఓట్లు దూరం.. ఇక వైసీపీకి ప్రశాంతత కరువైనట్టేనా?

YS Sharmila: రాజకీయ నాయకులు ఒక్కొక్కరు ఒక్కొక్క ఆస్త్రాన్ని ఆయుధంగా వాడుకుంటు ప్రత్యర్థులపై ప్రయోగిస్తున్నారు . అలాగే షర్మిల క్రిస్టియన్ కమ్యూనిటీ అనే పదాన్ని వాడుకుంటున్నారు. పదేపదే మన మతం అంటూ వైఎస్...
- Advertisement -
- Advertisement -