Baby Bedroom Scene: బేబీ బెడ్ రూమ్ సీన్ పై సాయి రాజేశ్ వివరణ ఇదే.. ఏం జరిగిందంటే?

Baby Bedroom Scene: సాయి రాజేష్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ వైష్ణవి చైతన్య కలిసి నటించిన తాజా చిత్రం బేబీ. ఇటీవల విడుదల అయిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను అందుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది. యూత్ కి ఈ బేబీ మూవీ బాగా నచ్చడంతో కొంతమంది రెండు మూడు సార్లు రిపీటెడ్ గా సినిమాను చూస్తున్నారు. కుర్రాళ్ల‌ తో సినిమా హాళ్లు నిండిపోతున్నాయి.

అయితే ఈ సినిమా తీసిన ద‌ర్శ‌కుడు సాయి రాజేష్‌కి బేబీ మూవీపై కాస్త అసంతృప్తిగా ఉన్నాడట. ఇంకాస్త బెట‌ర్‌గా తీసుండాల్సింది అంటూ త‌న‌ని తాను రివ్యూ చేసుకొన్నాడు సాయి రాజేష్‌. నేను ఏ సీన్స్ ద‌గ్గ‌ర ప్రేక్ష‌కులు రియాక్ట్ కాకూడ‌దు అనుకొన్నానో.. అక్క‌డే ఎక్కువ రియాక్ట్ అవుతున్నారు. చివ‌రికి నా సినిమా అప్ప‌ల్రాజులా మారిపోయింది. హృద‌య‌ కాలేయం సినిమాకి బౌండెడ్ స్క్రిప్టుతో సెట్ కి వెళ్లాను. ఈ సినిమా అలా కాదు. బౌండెట్ స్క్రిప్టే లేదు. ఏ రోజు స‌న్నివేశాలు ఆ రోజు రాసుకొన్నాను. సెట్ కి వెళ్లే ముందు ప్రాప‌ర్టీ వ‌చ్చేది. కానీ అలా చేయ‌డం త‌ప్పు.

 

నిర్మాత‌ల‌పై అద‌న‌పు భారం ప‌డుతుంది. ఈ విష‌యంలో నేను ఇక ముందు ఇంకాస్త జాగ్ర‌త్త‌గా ఉంటాను అని వివ‌ర‌ణ ఇచ్చాడు సాయి రాజేష్. ఈ సినిమాలో బెడ్ సీన్ల గురించి స్పందిస్తూ క్లారిటీ ఇచ్చాడు సాయి రాజేష్‌. బెడ్ రూమ్ సీన్స్ ని కూడా కొంత‌మంది త‌ప్పుగా అర్థం చేసుకొన్నారు. ఆ సీన్‌లో అమ్మాయి బాధ ప‌డుతుంది. అందుకే కంట్లోంచి నీరు కారుస్తుంది. అది ఎంజాయ్‌మెంట్ తో వచ్చిన క‌న్నీరు కాదు అని స‌మాధాన‌మిచ్చాడు.

Related Articles

ట్రేండింగ్

Assembly Election: ఏపీలో అక్కడ గెలిస్తే మంత్రి పదవి పక్కా.. ఈ నియోజకవర్గం ప్రత్యేకతలు ఇవే!

Assembly Elections: రాష్ట్రంలోని అతిపెద్ద నియోజకవర్గాలలో మైలవరం నియోజకవర్గం ఒకటి. ముందు ఈ నియోజకవర్గం కమ్యూనిస్టు పాలనలో ఉండేది, తర్వాత తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారింది. తెదేపా ఆవిర్భావం తర్వాత తొమ్మిది సార్లు...
- Advertisement -
- Advertisement -