Nara Lokesh: లోకేశ్ గొప్పదనం ఇదే.. ప్రజల కోసం ఆయన ఇంత చేస్తున్నారా?

Nara Lokesh: రానున్న ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ నాయకులు పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నారా లోకేష్ కూడా పాదయాత్ర చేపట్టగా.. ఈయన పాదయాత్ర అందరి పాదయాత్ర లాగా కాకుండా చాలా నిరంతరాయకంగా కొనసాగుతుంది. మామూలుగా ఇతర నాయకులు ఏదో అన్నట్లుగా కొంత సమయాన్ని మాత్రమే పాదయాత్రకు కేటాయిస్తున్నారు. కానీ నారా లోకేష్ అలా కాదు.

 

తెల్లవారు 4 గంటల నుండి రాత్రి చీకటి పడే వరకు తన పాదయాత్రను కొనసాగిస్తూనే ఉన్నాడు. ఎక్కడ కూడా విశ్రాంతి లేకుండా చేస్తూనే ఉన్నాడు. ఇక ఈయన చేస్తున్న పాదయాత్రకు ఆయన వెంబడి ఉన్న వాళ్ళ షాక్ అవుతున్నారు. అసలు ఈయనకు ఇంత ఎనర్జీ ఎలా ఉంటుంది అని ఆశ్చర్యపోతున్నారు. అయితే ప్రతిరోజు లోకేష్ ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత తన పార్టీ విషయాలపై చర్చలు జరుపుతాడట.

ఆ తర్వాత పాదయాత్ర చేస్తున్న నియోజకవర్గం గురించి షెడ్యూల్ తయారు చేసుకుంటాడట. ఇక ప్రతిరోజు తనతో సెల్ఫీ దిగా వారి కోసం గంటకు పైగా కేటాయిస్తున్నట్లు తెలిసింది. అందుకే వచ్చిన ప్రతి ఒక్కరికి సెల్ఫీలు ఇస్తున్నాడు. ఆ తర్వాత సమస్యల గురించి మాట్లాడి తెలుసుకుంటున్నాడు. పాదయాత్రలో కూడా తనతో మాట్లాడటానికి వచ్చిన వారితో కూడా నడుస్తూనే మాట్లాడుతున్నాడట.

 

మధ్యాహ్నం భోజనం కూడా సామాన్య ప్రజల వద్ద తీసుకుంటున్నట్టు తెలిసింది. కనీసం రోజుకు రెండు మూడు వర్గాలతో సమావేశం అవుతున్నాడట. ఇక వారి సమస్యలను తెలుసుకొని భరోసా ఇస్తున్నాడని తెలిసింది. ఇక తన చేతిలో ఉన్నంతవరకు పనులు చేసి పెడతానని.. సొంత డబ్బుతో సహాయం చేస్తానని అన్నాడట. ఇక పాదయాత్ర ముగిసిన తర్వాత కూడా కొన్ని సమావేశాలు కూడా నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఇక ఎలాగైనా ప్రజల నాయకుడిగా ఎదగడం కోసం బాగా కష్టపడుతున్నాడు లోకేష్. కనీసం తన ఆరోగ్యం పట్ల కూడా ఏమాత్రం శ్రద్ధ తీసుకోకుండా రోజుకు కేవలం నాలుగైదు గంటలు మాత్రమే పడుకొని మిగతా సమయమంతా ప్రజలకే కేటాయిస్తున్నట్లు తెలిసింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -